మోడీ చ‌మురు వాయింపు లెక్క తెలుసా?

Update: 2017-09-13 05:44 GMT
2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ముందు సోష‌ల్ మీడియాలో భారీగా ప్ర‌చారం జ‌రిగిన అంశాల్లో పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల‌కు సంబందించిన పోస్ట్ ను స‌గ‌టు జీవి అస్స‌లు మ‌ర్చిపోరు. అంత‌ర్జాతీయంగా చ‌మురు ధ‌ర‌లు పెద్ద‌గా లేకున్నా ప‌న్ను బాదుడుతో భారీగా వ‌సూలు చేస్తున్నార‌ని.. మోడీ లాంటి మొన‌గాడు ప్ర‌ధాని అయితే ప‌రిస్థితి మొత్తంగా మారిపోతుంద‌ని.. స‌గ‌టుజీవి ఊపిరి పీల్చుకుంటాడ‌న్న‌ది సారాంశం.

ప్ర‌చారంతో మోత ఎక్కించి.. స‌గ‌టుజీవిలో కోటి ఆశ‌లు రేపిన ఈ ప్ర‌చారం.. వాస్త‌వంలో ఎలా ఉంది?  మూడున్న‌రేళ్ల పాల‌న‌ను ముగించిన సంద‌ర్భంలో మోడీ జ‌నాల‌కు చేసిందేమిటి?  మిగిలిన విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. పెట్రోల్‌.. డీజిల్ విష‌యాల్లో ధ‌ర‌లు ఎంత త‌గ్గాయి? ఎంత పెరిగాయి?  అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. త‌గ్గుతుంద‌ని అనుకున్న చ‌మురు ధ‌ర‌లు అంత‌కంత‌కూ ఎందుకు పెరుగుతున్నాయ‌న్న‌ది మ‌రో సందేహం. అన్నింటికి మించి అంత‌ర్జాతీయంగా అంత‌కంత‌కూ చ‌మురు ధ‌ర‌లు త‌గ్గుతుంటే.. దేశీయంగా మాత్రం పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? అన్న‌ది మ‌రో కీల‌క‌మైన ప్ర‌శ్న‌.
 
గ‌డిచిన కొంత‌కాలంగా పెట్రోల్‌.. డీజిల్ మీద ఎంత ఎక్కువ‌గా ధ‌ర‌లు పెరిగాయ‌న్న‌ది లెక్క చూస్తే.. ప్ర‌ధాని మోడీ మీద ఉన్న గౌర‌వ‌మంతా పోవ‌టమే కాదు.. తియ్య‌టి మాట‌ల వెనుక  చేదుమాత్ర‌లు ఎంత నైపుణ్యంగా వేస్తారో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి. 2014లో మోడీ స‌ర్కారు బాధ్య‌త‌లు స్వీక‌రించిన వేళ లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.71.50. అప్ప‌ట్లో అంత‌ర్జాతీయంగా మార్కెట్లో బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర 106 డాల‌ర్లు.ఉంది. ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా మార్కెట్ లో బ్యారెల్ ముడిచ‌మురు 52 డాల‌ర్లు. కానీ.. లీట‌రు పెట్రోల్ ధ‌ర మాత్రం రూ.74.50. అంటే.. ముడిచ‌మురు ధ‌ర రేటు అంత‌ర్జాతీయంగా స‌గానికి సగం త‌గ్గినా.. ధ‌ర మాత్రం నాలుగు శాతం మేర పెరగ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు అంద‌రి మ‌దిని దోచేస్తోంది.

సాధార‌ణంగా అంత‌ర్జాతీయంగా ధ‌ర త‌గ్గిన‌ప్పుడు.. ఆటోమేటిక్ గా పెట్రోల్‌.. డీజిల్ పెర‌గ‌టాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. కానీ.. ధ‌ర‌లు పెర‌గ‌కున్నా.. పెంచేయ‌టం మీద ప‌లువురుఅభ్యంత‌రాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో ప్ర‌తి ప‌దిహేను రోజుల‌కు ఒక‌సారి రివ్యూ మీటింగ్ పెట్టుకొని పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు చెక్ చేసి.. ఎక్కువ త‌క్కువ నిర్ణ‌యాలు తీసుకునే వారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మొత్తం మారిపోయింది.

ఏ రోజుకు ఆ రోజు స‌మీక్ష జ‌రిపి.. ఐదు పైస‌లో.. ప‌ది పైస‌లో ప‌న్ను విధించేందుకు రంగం సిద్ధ‌మైన వేళ‌.. ధ‌ర‌లు ఆకాశం వైపే చూస్తున్నాయని చెప్ప‌క త‌ప్ప‌దు. గడిచిన రెండున్న‌ర నెల‌ల్లో లీట‌రు పెట్రోల్ మీద రూ.7.. లీట‌ర్ డీజిల్ మీద లీట‌రుకు రూ.5 మేర పెరిగింది.

దేశంలోని అన్ని ప్రాధాన న‌గ‌రాల్లోనూ ఉన్న‌దే. అయితే.. తాము అధికారంలోకి వ‌చ్చాక పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని భారీగా త‌గ్గిస్తామ‌ని చెప్పిన మోడీ స‌ర్కారు.. ఇప్పుడు ఆ విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ట‌మే కాదు.. వినూత్నంగా వాత‌లు పెట్టి జ‌నం జేబుల్లో నుంచి ద‌ర్జాగా డ‌బ్బుల్ని అడ్డంగా లాగేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కొన్ని వారాల కింద‌ట నెల‌లో రెండుసార్లు రివ్యూ చేసిన స‌మ‌యంలో విపక్షాల‌కు జ‌నం మీద ప‌డే భారం వెంట‌నే తెలిసేది. ఆ వెంట‌నే విప‌క్షాలు సైతం స్పందించేది. ప్ర‌భుత్వం మీద ఒత్తిడి తెచ్చేవి. కానీ.. ఇప్పుడా ప‌రిస్థితి అన్న‌దే లేకుండా చేయ‌టంతో నిర‌స‌న‌కు అవ‌కాశ‌మే లేకుండా పోయింది. జులైలో ఉన్న ధ‌ర‌ల‌కు.. ఇప్పుడున్న ధ‌ర‌ల‌ను పోల్చి.. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌ల్ని చూస్తే.. డీజిల్ బిల్లుతో కేంద్రం భారీగానే నిధులు స‌మ‌కూర్చుకుంటుంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధినే చూస్తే.. జులై 1న లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.67.11 ఉండ‌గా.. ఇప్పుడు లీట‌రుకు రూ.7.41 పెరిగింది. అంతే పెరుగుద‌ల 12 శాతం వ‌ర‌కూ ఉంటుంది. అదే స‌మ‌యంలో డీజిల్ ధ‌ర‌ల్నిచూస్తే.. జులైలో లీట‌రు డీజిల్ రూ.58.22 ఉంటే.. తాజా ధ‌ర రూ..63.79గా మారింది. అంటే.. లీట‌రుకు 11 శాతం పెరుగుద‌ల న‌మోదైంది. అదేస‌మ‌యంలో అంత‌ర్జాతీయంగా ధ‌ర ఎంత పెరిగింద‌న్న విష‌యాన్ని చూస్తే.. కేవ‌లం నాలుగు శాతం మాత్ర‌మే ఉండ‌టం గ‌మ‌నార్హం. మోడీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన‌ప్పుడు బ్యారెల్ వంద డాల‌ర్ల‌పైనే ఉంటే.. ఆగ‌స్టులో 50 డాల‌ర్ల‌కు చేరుకుంది.  మ‌రి.. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు త‌గ్గుతున్నా.. దేశీయంగా మాత్రంపెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్న‌ట్లు?  సామాన్యుడి జేబుకు చిల్లుప‌డేలా నిర్ణ‌యాలు ఎందుకు తీసుకుంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌గా చెప్పాలి. మ‌రింత షాకింగ్ విష‌యం ఏమిటంటే.. జేబులో నుంచి డ‌బ్బుల్ని గుట్టుచ‌ప్పుడు కాకుండా లాగేస్తున్నా.. ఎవ‌రికి ఎలాంటి నొప్పి లేకుండా ఉండ‌టం. ఇలాంటివ‌న్నీ మోడీకి మాత్ర‌మే సాధ్య‌మేమో?
Tags:    

Similar News