దేశ ప్రధానిగా ఉండే వ్యక్తి టైం ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి క్షణం అమూల్యమైనది. అలాంటి ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి.. దాదాపు ఒకటిన్నర రోజు ఒకే అంశం మీద దృష్టి పెట్టటం.. దీనికి సంబంధించి పలువురు సీనియర్ ఉన్నతాధికారులతో భేటీలు నిర్వహించటం ఆసక్తికరంగా మారింది. పాక్ తీరుపై ప్రధాని మోడీ ఎంత సీరియస్ గా ఉన్నారనటానికి తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామే నిదర్శనంగా చెప్పాలి. దాయాది పాక్ కారణంగా ఇప్పటికే పలుమార్లు దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు చోటు చేసుకోవటం.. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఉరీ ఉదంతంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల కారణంగా 20 మంది వీరజవానళ్లు ప్రాణాలు కోల్పోవటంపై భారతావని ఉడికిపోతోంది. ఈ ఘటనపై స్పందిస్తోన్న పలువురు పాక్ తో కంటికి కన్ను.. పన్నుకు పన్ను ధర్మాన్ని పాటించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే.. యుద్ధానికైనా రెఢీ అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి.. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రధాని మోడీ ఏం చేశారన్న విషయాన్ని చూస్తే.. ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ఏం జరగనుందన్నది ప్రశ్నగా మారటం ఖాయం. దాదాపు ఒకటిన్న రోజుల పాటు ఆర్మీ తాలూకూ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ లో మోడీ అత్యున్నత స్థాయి భేటీలు నిర్వహించటం గమనార్హం. వార్ రూమ్ గా వ్యవహరించే ఈ కార్యాలయంలో మోడీ ఉండిపోయారు. ఈ కార్యాలయానికి ఉన్నప్రత్యేకత ఏమిటంటే.. రక్షణ శాఖలో అత్యంత రహస్యమైన కార్యాలయంగా దీన్న చెబుతారు. రక్షణ శాఖకు సంబందించిన భద్రతాపరమైన అంశాల్ని ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తుంటారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కేంద్రంలోని పలువురు కీలక మంత్రులతో పాటు.. ఆర్మీ చీఫ్ తో భేటీ అయిన మోడీకి.. మ్యాప్ లు.. కొన్ని నమూనాలతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి.. ఈ కసరత్తు అంతా దేని గురించి అన్నది బయటకు పొక్కనీయటం లేదు. ఉరీ వ్యవహారంలో పాక్ తీరును తీవ్రంగా పరిగణిస్తున్న మోడీ సర్కారు ఇప్పుడేం చేయనుందన్నది కోటి రూకల ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.