రాహుల్ ఓ ట్యూబ్ లైట్..సూర్యనమస్కారాలు..తరిమికొట్టడాలు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు తన ప్రసంగం ప్రత్యేకతను చూపించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఆయన తనదైన స్టైల్లో విమర్శలు చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మోదీ మాట్లాడుతున్నప్పుడు రాహుల్ జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం లేదని - ప్రధాని మోదీని యువత కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు మోదీ సమాధానం ఇచ్చారు. ట్యూబ్ లైటు తరహాలో రాహుల్ గాంధీ నిదానంగా స్పందిస్తారని మోదీ అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు విజన్ - డైరెక్షన్ ను ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. గత 70 ఏళ్ల పాలన తరహాలోనే తమ ప్రభుత్వం నడిస్తే.. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు - ట్రిపుల్ తలాక్ రద్దు జరిగేది కాదన్నారు. ప్రతిపక్ష పార్టీల తరహాలో తమ ప్రభుత్వం ఆలోచిస్తే.. అయోధ్యలో రామ మందిరం కూడా సాకారం అయ్యేది కాదని తెలిపారు. కర్తార్ పూర్ కూడా వాస్తవ రూపం దాల్చేది కాదని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాచరణపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్న ప్రధాని మోదీ. తక్కువ సమయంలో ప్రభుత్వం ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తుందోనని ఆశ్చర్యపోతున్నాయని తెలిపారు.
ఇరు నెలల్లో మోదీని యువత కొడుతారని విపక్షాలు ఆరోపిస్తున్నాయని, అయితే రాబోయే ఆర్నెళ్లు సూర్యనమస్కారాలు చేసి వెన్నును దృఢంగా మార్చుకుంటానని, అప్పుడు మీరు ఎంతైనా కొట్టవచ్చు అని మోదీ అన్నారు. 30-40 నిమిషాల నుంచి మాట్లాడుతుంటే.. రాహుల్‌కు అర్థం కావడం లేదా.. కొన్ని ట్యూబ్ లైట్లు ఇంతే ఉంటాయని మోదీ చమత్కరించారు. దీంతో సభలో ఉన్న బీజేపీ నేతలంతా బల్లలు చరిచారు.
ఈ సందర్భంగా జమ్మూ - కశ్మీర్ - లఢఖ్ గురించి సైతం ప్రధాని స్పందించారు. ఆ మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ఆయన…ఒమర్ అబ్ధుల్లా - మహబూబా ముఫ్తీ గృహనిర్బంధంపై స్పందించారు. మహబూబా ముఫ్తీ భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఒమర్ అబ్ధుల్లా - ఫరూక్ అబ్ధుల్లాలు ఆర్టికల్ 370 తొలగింపుకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టారని అన్నారు. జమ్మూ కశ్మీర్ లో శాంతికి విఘాతం కలిగించే చర్యలను సహించేది లేదన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని మార్చడమే కాదు.. ఆ ప్రభుత్వంతో ముందుకెళ్లేందుకు సిద్ధమయ్యారన్నారు. రాజకీయ స్థిరత్వం కోసం ఈశాన్య రాష్ట్రాలు ఎన్నో దశాబ్ధాలు వేచి చూశాయన్నారు. కానీ, తమ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలను ఢిల్లీకి దగ్గర చేశామన్నారు.