అప్పట్లో ట్రంప్ మాటలు విని మోడీ షాక్ తిన్నారట

Update: 2020-01-16 12:06 GMT
అగర్భ శ్రీమంతుడు (మన సినిమా శ్రీమంతుడు అర్థంలో కాదు సుమా) అమెరికా అధ్యక్షుడైతే ఎలా ఉంటుంది. ట్రంప్ పరిస్థితి ఇంచుమించు అలానే ఉంటుంది. స్థిరాస్తి వ్యాపారంలో వందలాది కోట్లు సంపాదించిన అతగాడికి వ్యాపారవేత్తకు ఎక్కువ.. రాజకీయ నాయకుడికి చాలా తక్కువ. ఇంగ్లిషు మీద అంతంతమాత్రమే పట్టు.. ప్రపంచం మీద అవగాహన కూడా తక్కువే. ఇక.. దేశాల సరిహద్దుల్లాంటి మీద ఆయనకు ఏమీ తెలీదన్న విషయం అర్థమైన సందర్భంలో ప్రధాని మోడీ సైతం షాక్ తిన్నట్లుగా వాషింగ్టన్ పోస్టుకు చెందిన ఇద్దరు పాత్రికేయులు వెల్లడించారు.

ఏ వెరీ స్టేబుల్ జీనియస్ పేరుతో జర్నలిస్టులు ఫిలిప్ రుకర్..కరోల్ లియోనిగ్ రాస్తున్న పుస్తకంలో తాజా వివరాలు బయటకు వచ్చాయి. మోడీతో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. చైనా భారత్ తో సరిహద్దును పంచుకోవటం లేదన్నారని.. అది విన్న మోడీ షాక్ తిన్నట్లు వారు పుస్తకంలో పేర్కొన్నారు.

అంతేకాదు.. ప్రపంచంలో జరిగిన పలు చారిత్రక ఘటనల గురించిన అవగాహన కూడా ట్రంప్ కు లేదని ఆ పుస్తకంలో వెల్లడించారు. జపాన్ లో జరిగిన పెరల్ హార్బర్ పై జరిగిన దాడి గురించి ట్రంప్ నకు అసలేమీ తెలీదని పేర్కొన్నారు. ప్రపంచంలో తనను తాను అత్యంత తెలివైన వ్యక్తిగా ట్రంప్ పేర్కొంటారని.. ఆయనకు నేపాల్.. భూటాన్ దేశాలన్న సంగతి కూడా తెలీదని.. అవి భారత్ లోనే ఉంటాయని ఆయన భావిస్తారని పేర్కొన్నారు.పుస్తకంలోని కొన్ని అంశాలే ఇలా ఉంటే.. మొత్తం పుస్తకంలో మరెన్ని సంచలన అంశాలు ఉంటాయో?



Tags:    

Similar News