రసవత్తరంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరి అంచనాలకూ అందకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధాని నుంచి అభినందనలు అందాయి. ఇదే క్రమంలో ఎన్నికల ప్రచారంలో హిల్లరీ... ఎవరైతే ట్రంప్ కు స్నేహితులు అని ప్రచారం చేసేవారో ఆ దేశమైన రష్యా నుంచీ ట్రంప్ కు అభినందనల జల్లులు కురిశాయి. ఈ విషయంలో రష్యాలోని అన్ని రాజకీయ పక్షాలు ట్రంప్ ను అభినందించడం గమనార్హం.
అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ విజయం సాధించిన ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమెరికా - భారత సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ట్వీట్ చేశారు. అలాగే, ఎన్నికల ప్రచార సమయంలో భారత్ తో ఉన్న అనుభందాన్ని స్నేహాన్ని ప్రస్థావించినందుకు ట్రంప్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు మోడీ.
ఇదే క్రమంలో మరో అగ్ర రాజ్యం రష్యా నుంచి ట్రంప్ కు అభినందనల జల్లులు కురిశాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్.. ట్రంప్ కు టెలిగ్రాం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రంప్ గెలుపుతో అయినా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయని తాను ఆశిస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. అలాగే... రష్యాలోని మేజర్ రాజకీయ పార్టీలన్నీ కూడా ట్రంప్ కు అభినందనలు తెలియజేశాయి.
కాగా, ట్రంప్ కు రష్యాతో వ్యాపార లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని కాపాడుకునేందుకే పుతిన్ కు అనుకూలంగా ట్రంప్ మాట్లాడుతున్నారని.. ఎన్నికల ప్రచార సాయంలో హిల్లరీ పలుమార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/