మార్స్ ను చుట్టేసేందుకు భారతీయులు తహతహలాడుతున్నారు. అంగారకుడిపై అణువణువు శోధించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ యాత్ర కోసం భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఈ యాత్ర కోసం 1,38,899 మంది టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. వారికి ఆన్‌లైన్ బోర్డింగ్ పాస్ లు కూడా ఇచ్చేశారు. నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇన్ సైట్’ (ఇంటీరియర్ ఎక్స్ ప్లోరేషన్ యూజింగ్ సీస్మిక్ ఇన్వెస్టిగేషన్స్ - జియోడెసీ అండ్ హీట్ ట్రాన్స్ పోర్ట్) మిషన్ ద్వారా వీరందరూ అంగారకుడిని చుట్టిరాబోతున్నారు. 2018 మే 5న లాంచ్ అవ్వబోతున్న ఈ మిషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా 24,29,807 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ యాత్రకు వెళ్లే జాబితాలో అగ్రరాజ్యం అమెరికా, పొరుగు దేశం చైనా తర్వాత మూడో స్థానంలో భారత్ ఉంది. అమెరికా నుంచి 6,76,773 మంది, చైనా నుంచి 2,62,752 మంది వెళుతున్నారు. మార్స్ పైకి ఇంతమంది ఎలా వెళతారు? అంత ఖర్చు భరించి అంగారకుడి యాత్ర చేస్తారా? అనే సందేహాలు రావడం సహజం. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. వీరంతా వ్యోమగాములుగా మార్స్ పైకి వెళ్లడం లేదండి. ఆ 24 లక్షల మంది పేర్లు మాత్రమే అంగారుకుడిపైకి వెళ్లబోతున్నాయి.
నాసా ఇన్ సైట్ మిషన్.... 2018 మే 5న లాంచ్ అయ్యి.... నవంబరు 26న మార్స్ పై ల్యాండ్ కాబోతోంది. మొత్తం 720 రోజుల పాటు ఈ మిషన్ సాగనుంది. అంగారకుడిపై ఉన్న పరిస్థితులు, అక్కడి భూకంపాలకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు ఈ మిషన్ ను నాసా చేపట్టింది. అంతేకాకుండా సౌర వ్యవస్థలో రాతి గ్రహాలు ఏవిధంగా ఏర్పడ్డాయన్న విషయాన్ని ఈ మిషన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ 24 లక్షల మంది పేర్లను ఓ చిన్న సిలికాన్ వేఫర్ మైక్రోచిప్ లో పొందుపరిచి..... ఆ చిప్ ను ఇన్ సైట్ మిషన్ ల్యాండర్ టాప్ కు అనుసంధానం చేయనున్నారు. ఎలక్ట్రాన్ బీమ్ సాయంతో వెంట్రుకలో వెయ్యో వంతు వ్యాసంతో ఆ అక్షరాలను నాసా శాస్త్రవేత్తలు తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రయోగంపై భారత్ నుంచి చాలామంది ఆసక్తి చూపడానికి ప్రత్యేక కారణాలున్నాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మంగళ్ యాన్’ మిషన్ విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ మిషన్ తర్వాత భారతీయుల్లో అంగారకుడిపై పూర్తి అవగాహన ఏర్పడింది. అంతేకాకుండా, అంతరిక్ష సంబంధ అంశాల్లో అమెరికా-ఇండియాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. గతంతో పోలిస్తే అంతరిక్ష విషయాల్లో ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడింది.