భూమికి చేరువ‌గా గ్ర‌హ‌శ‌క‌లం.. తేడా కొడితేనా?

Update: 2018-08-27 04:21 GMT
సాంకేతికంగా మ‌నిషి ఎంతగా వృద్ధి చెందినా.. ఇప్ప‌టికి అర్థం కానివికి మ‌న చుట్టూ చాలానే ఉన్నాయి. అనంత విశ్వంలో త‌ర‌చూ ఏదో ఒక స‌వాలు ఎదుర‌వుతూనే ఉంటుంది. అయితే.. ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాని పరిస్థితి. విశ్వంలో సంచ‌రించే భారీ గ్ర‌హ శ‌క‌లాలు భూమికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి వెళ్లే ప‌రిస్థితి.

తాజాగా అలాంటి ప‌రిణామ‌మే మ‌రొక‌టి చోటు చేసుకోనుంది. రెండు బోయింగ్ విమానాల సైజులో.. మ‌రింత స్ప‌ష్టంగా చెప్పాలంటే ఒక పిర‌మిడ్ కంటే పెద్ద‌దిగా ఉండేంత గ్ర‌హ శ‌క‌లం ఒక‌టి భూమికి అత్యంత చేరువ‌గా వెళ్ల‌నుంది. ఈ గ్ర‌హ శ‌క‌లం  ఈ నెల 29న భూమికి చేరువ‌గా రానున్న‌ట్లు నాసా పేర్కొంది.

గంట‌కు 32,400 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ గ్ర‌హ‌శ‌క‌లం భూమిని తాకితే న‌ష్టం దారుణంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఒక మ‌హాన‌గ‌రాన్ని నామ‌రూపాల్లేకుండా చేసే శ‌క్తితో పాటు.. కోట్లాది మంది ప్రాణాలు తుడిచిపెట్టుకుపోయే వీలుంద‌ని చెబుతున్నారు.

ఈ గ్ర‌హ‌శ‌క‌లం 70 నుంచి 160 మీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గ్ర‌హ‌శ‌క‌లం ఈ నెల 29న భూమికి అత్యంత చేరువ‌గా అంటే.. 48 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల  దూరం నుంచి వెళ్ల‌నున్న‌ట్లు చెబుతున్నారు. భూమికి.. చంద్రుడికి మ‌ధ్యన ఉన్న దూరానికి 13 రెట్లు ఎక్కువ‌గా ఉండే ఈ గ్ర‌హ‌శ‌క‌లం భూమిని తాకితే న‌ష్టం ఊహించ‌లేనంత ఎక్కువ‌గా ఉంటుంద‌ని.. ఆ న‌ష్టాన్ని లెక్కించ‌టం సాధ్యం కాద‌న్న మాట‌ను నిపుణులుచెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం భూమికి ఎలాంటి న‌ష్టం లేకున్నా.. ఏదైనా అనూహ్య ప‌రిణామం త‌లెత్తితే? అన్న సందేహం ఒళ్లు జ‌ల‌ద‌రించేలా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.



Tags:    

Similar News