అగ్రరాజ్యం అమెరికా ఆరోపణలపై భారతీయ ఐటీ కంపెనీలు స్పష్టమైన క్లారిటీ ఇచ్చాయి. భారత ఐటీ కంపెనీలు అత్యధికంగా హెచ్-1బీ వీసాలను చేజిక్కించుకొనేందుకు అక్రమాలకు పాల్పడ్డాయని.. తక్కువ మొత్తం చెల్లించి తెచ్చిన నిపుణులతో స్థానికుల ఉపాధికి గండి కొట్టినట్టుగా అమెరికా చేసిన ఆరోపణలను నాస్కామ్ తిప్పికొట్టింది. వాస్తవాలను గణాంకాల రూపంలో వెల్లడించింది. భారత ఐటీ రంగం అమెరికాలో ఉద్యోగాలను సృష్టించిందన్న విషయాన్ని 'నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ' (నాస్కామ్)' పునరుద్ఘాటించింది. తమ సంస్థలు అమెరికాలో ప్రత్యక్షంగాను.. పరోక్షంగానూ దాదాపు అయిదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్టుగా తెలిపింది.
2015 ఏడాదికి గాను హెచ్-1బీ వీసాలను చేజిక్కించుకున్న టాప్ 20 సంస్థల్లో భారతీయ కంపెనీలు కేవలం ఆరు మాత్రమే ఉన్నట్టుగా నాస్కామ్ తెలిపింది. హెచ్-1బీ వీసాల్లో అత్యధికం భారత్‌కు చెందిన టీసీఎస్ - ఇన్ఫోసిస్ సంస్థలే అక్రమంగా చేజిక్కుంచుకున్నాయంటూ చేసిన ఆరోపణలకు కూడా నాస్కామ్ వివరణనిచ్చింది. ఈ రెండు సంస్థలు కలిసి కేవలం 7,504 వీసాలను మాత్రమే సొంతం చేసుకున్నట్టుగా తెలిపింది. ఇది అమెరికా అనుమతి ఇచ్చిన మొత్తం వీసాల్లో కేవలం 8.8 శాతానికి సమానమని తెలిపింది.
మరోవైపు హెచ్-1బీ వీసాదారులకు భారత కంపెనీలు స్థానికులకంటే కూడా ఎక్కు వగానే చెల్లించినట్టుగా నాస్కామ్ గణాంకాలను వెల్లడించింది. అమెరికా ప్రభుత్వం సూచించిన కనీస వేతనం 60,000 డాలర్లయితే ఆయా సంస్థలు కనిష్టంగా దాదాపు 82,000 డాలర్లకు పైబడే చెల్లించినట్టుగా తెలిపింది. దీనికి వీసాలకు సంబంధించిన చెల్లించే స్థిర ఖర్చులు 15,000 డాలర్లు అదనమేనని వివరణనిచ్చింది. 2018 నాటికి అమెరికా సైన్స్ - టెక్నాలజీ - ఇంజినీరింగ్ - గణితం (స్టెమ్) విభాగాల్లో 24 లక్షల ఉద్యోగులు అవసరం అవుతారని స్థానిక కార్మి క శాఖ వెల్లడించడాన్ని గుర్తు చేసింది. ఇందులో సగం ఉద్యోగాలు ఐటీ రంగాల్లోనే రానున్నట్టుగా తెలిపింది. మొత్తం అమెరికా ఉద్యోగుల్లో భారతీయ తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య కేవలం 0.009 శాతం మాత్రమేనని తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/