ఏ చంద్రుడితో క‌ల‌వాలి...

Update: 2018-12-25 15:30 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల జోరు ప్రారంభ‌మైంది. అదికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా సార్టీ తిరిగి అధికారాన్ని నిల‌బెట్టుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఆ పార్టీని ఎలాగైనా గద్దె దించేందుకు ఎవ‌రితోనైనా క‌ల‌వాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ రెండు పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల‌న్నీంటిని ఏకం చేయాల‌ని తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర స‌మ‌తి అధ్య‌క్షుడు - తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు త‌న ప్ర‌యత్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఇప్ప‌టికే ఒడిసా వెళ్లి ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తో భేటీ అయ్యారు. అక్క‌డి నుంచి కోల్ క‌తా వెళ్లిన కె.చంద్ర‌శేఖ‌ర రావు అక్క‌డ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని క‌లుసుకున్నారు. అక్క‌డి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన కె.చంద్ర‌శేఖ‌ర రావు మిగిలిన పార్టీల వారిని కూడా క‌లుసుకునే అవ‌కాశాలున్నాయంటున్నారు. ఇంత‌కు ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కూడా ఈ నాయ‌కులంద‌రిని క‌లిసి థ‌ర్డ్ ఫ్రంట్ గురించి త‌న ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

ఇవ‌న్నీ ఓ ప‌క్క‌జ‌రుగుతూంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయ‌కులు మాత్రం త‌మ మ‌న‌సులో ఉన్న మాట‌ను బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఒక‌రంటే ఒక‌రికి తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది.ఈమ‌ధ్యే ముగిసిన తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల బ‌రిలో ఇద్ద‌రు చంద్రులు బాహాబాహీ త‌ల‌ప‌డ్డారు. ఇందులో తెలంగాణ ముఖ్య‌మంత్రే పైచేయి సాధించారు. అయితే, ఈ ఇద్ద‌రు చంద్రుల్లో ఎవ‌రితో క‌ల‌వాలి అనేది ఇత‌ర పార్టీల‌కు చెందిన వారు తేల్చుకోలేక‌పోతున్నారు. చంద్ర‌బాబు నాయుడు కేంద్రంలో భారతీయ జ‌న‌తా పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీతో క‌లిసేందుకు ముందుకు వ‌చ్చారు. మ‌మ‌తా బెన‌ర్జీ - వామ‌ప‌క్షాల నాయకుల‌కు - అమ్ ఆద్మీ నాయ‌కుల‌తో పాటు మ‌రికొన్ని ప్రాంతీయ పార్టీల నాయ‌కుల‌కు కాంగ్రెస్ తో క‌ల‌వ‌డం సుతారము ఇష్టం లేదు. దీంతో వారంతా తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుతోనే క‌లిసే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. అలాగే చంద్ర‌బాబు నాయుడితో క‌ల‌యిక భ‌విష్య‌త్ లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని వారు భ‌య‌ప‌డుతున్నారంటున్నారు. థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల‌నుకుంటున్న చంద్ర‌బాబు నాయుడి కంటే రెండు జాతీయ పార్టీల‌కు వ్య‌తిరేకంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు స‌న్నాహాలు చేస్తున్న క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు వెంట ఉండాల‌ని కొంద‌రు నాయ‌కులు లోపాయికారిగా నిర్ణ‌యించుకున్న‌ట్లు చెబుతున్నారు.రానున్న‌రెండు నెల‌ల్లో జాతీయ స్ధాయి రాజ‌కీయాల్లో పెను మార్పుల త‌ప్ప‌వ‌ని అంటున్నారు.

Tags:    

Similar News