గ్యాంగ్ స్టర్ నయీమ్ కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తన మాట వినని, తాను అడిగిన మేర డబ్బు అందించని వారిని అత్యంత దారుణంగా మట్టుబెట్టిన నయీం... తన సొంత బావనే చంపేసిన వైనం తాజాగా వెలుగుచూసింది. తన సోదరి భర్త అని కూడా చూడని నయీం... అత్యంత కిరాతకంగా చంపేసి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. హైదరాబాదు శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా శంషాబాదు మండలం పెద్ద తూప్ర వద్ద మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నయీం ఎన్ కౌంటర్ నేపథ్యంలో అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారుల విచారణలో ఈ విషయం వెలుగుచూసింది.
వివరాల్లోకెళితే... 2013 ఫిబ్రవరి 2న పెద్దతూప్ర- చిన్నతూప్ర వద్ద ఓ గుర్తు తెలియని శవం పడి ఉందన్న విషయంలో పోలీసులు అక్కడికెళ్లారు. కేవలం ఎరుపు రంగు డ్రాయర్ - నైట్ ప్యాంట్ మాత్రమే ఉన్న ఓ యువకుడి శవాన్ని పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు సదరు యువకుడిని ఎక్కడో చంపేసి - ఇక్కడికి తెచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని భావించారు. ఆ తర్వాత సదరు యువకుడికి సంబంధించి వివరాల కోసం శోధించిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో గుర్తు తెలియని యువకుడి హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు క్లోజ్ చేసేశారు.
తాజాగా నయీం అనుచరుల విచారణలో సదరు హత్య కేసు వివరాలు బయటకు వచ్చాయి. దీంతో సిట్ అధికారుల ఆదేశాలతో శంషాబాదు పోలీసులు సదరు యువకుడి అస్థికలను తీసి - నయీం సోదరి అత్త డీఎన్ ఏతో పోల్చి చూశారు. దీంతో చిక్కుమముడి వీడిపోయింది. హత్యకు గురైన వ్యక్తి... నయీం సోదరి భర్త విజయ్ కుమార్ అలియాస్ నదీమ్ గా పోలీసులు తేల్చారు. నదీమ్ ను నయీం స్వయంగా హత్య చేసి పెద్ద తూప్ర వద్ద పడేసినట్లు అతడి అనుచరులు పోలీసులకు చెప్పారు.