దేశంలో డ్రగ్స్ కేసు రోజుకో ట్విస్ట్ ఇస్తోంది. డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ సినీ రంగాన్ని కుదిపేస్తుండగా ఇండస్ట్రీకి చెందిన ప్రముకులకు ఈ కేసుతో సంబంధాలున్నట్లు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇటీవల షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పోలీసులకు పట్టుబడడంతో ఎన్సీబీ అధికారులు విచారణను మరింత పటిష్టం చేశారు. ఇందులో ఉన్నవారెంతటివారైనా పట్టుకుంటామని ఎన్సీబీ చీఫ్ సమీర్ వాఖండే అంటున్నారు. ఇక ఈ కేసులో బాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాత ఇల్లును తాజాగా సోదా చేశారు. అయితే ఈ నిర్మాత గతంలో సుశాంత్ కేసులో మిస్సయినా ఇప్పుడు మాత్రం ఆయనను విచారించడానికి సమాయత్తమవుతున్నారు.
ఎన్సీబీ చీఫ్ సమీర్ వాఖండే ఆధ్వర్యంలో డ్రగ్స్ కేసును సీరియస్ గా తీసుకుంటున్నారు. ఆర్యన్ ఖాన్ అరెస్టుతో ఆయన చెబుతున్న వివరాల ప్రకారం బాలీవుడ్ కు చెందిన ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఇండస్ట్రీకి చెందిన నిర్మాత ఇంతియాజ్ ను విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ అధికారులు ఆదేశించారు. దీంతో ఫిల్మ్ నగర్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇంతియాజ్ నివాసం, కార్యాలయంలో సోదాలు నిర్వహించాని కొన్ని పత్రాలను సేకరించామని ఎన్సీబీ అదికారులు తెలిపారు. దీంతో బాలీవుడ్లోని కొందరికి కంటిమీద కునుకు లేకుండా పోయింది.
హిందీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న తరువాత పోలీసులు డ్రగ్స్ వ్యవహారంపై దృష్టి పెట్టారు. ఈ వ్యవహారంలో ఉన్నవారిని విచారిస్తూ వస్తున్నారు. ఆ సమయంలో రియా చక్రవర్తి, రకులు ప్రీత్ సింగ్ తదితర నటులను పోలీసులు విచారించారు. ఇదే సమయంలో బాలీవుడ్ నిర్మాత ఇంతియాజ్ చక్రవర్తి పేరు కూడా వినిపించింది. అయితే ఆ సమయంలో ఏదోరంగా ఎన్సీబీ అధికారుల నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది.
తాజాగా ఆర్యన్ ఖాన్ పట్టుపడిన తరువాత ఆయనతో సంబంధాలనున్న వారిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఇంకొందరిని విచారిస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఎక్కడ తనిఖీలు చేసినా గ్రాముల కొద్దీ మాదక ద్రవ్యాలు లభ్యమవుతున్నాయి. దీంతో దేశం మొత్త డ్రగ్స్ కోరల్లో చిక్కుకుందని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఎన్సీబీ అధికారులు నిర్ణయించారు. సమీర్ వాఖండే అధ్వర్యంలో విచారణనే వేగవంతంతో పాటు సంబంధాలున్న ప్రతీ ఒక్కరిని చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఆర్యన్ ఖాన్ విచారణలో చెప్పిన సమాచారం మేరకే నిర్మాత ఇంతియాజ్ ఇంట్లో దాడులు నిర్వహించారన్న చర్చ సాగుతోంది. గత కొన్ని రోజుల కిందట ముంబై టు గోవా వెళుతున్న క్రూయిజ్ షిఫ్ లో రేవ్ పార్టీ నిర్వహించుకుంటుండగా ఆర్యన్ ఖాన్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఆసమయంలో మొదట 8 మందిని మాత్రమే అరెస్టు చేసిన పోలీసులు ఆర్యన్ ఖాన్ చెప్పిన తరువాత 130 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రేవ్ పార్టీ సమయంలో ఆ షిప్ లో వెయ్యిమంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అయితే తాజాగా నిర్మాత విషయం కూడా ఆర్యన్ ఖాన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చర్చ సాగుతోంది.
దీంతో ఆర్యన్ మరెంత మంది పేర్లు బయటపెడుతారోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇక డ్రగ్స్ రవాణా చేసేవారిలో కూడా దడ మొదలైందని అంటున్నారు. అయితే డ్రగ్స్ వినియోగించిన వారిని కాకుండా దాని మూలాలను పట్టుకోవాలని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నా.. ఆ దిశగానే ఎన్సీబీ అధికారులు విచారణ జరుపుతున్నారని ప్రభుత్వ మద్దతుదారులు అంటున్నారు. మరి ఎన్సీబీ అధికారులు చివరికి డ్రగ్స్ మూలాలను తెంచేస్తారా..? లేదా.. చూడాలి.