వైసీపీ అధినేత జగన్ కు సినిమా రంగంలో హీరో బాలకృష్ణ అంటే ఇష్టం. ఆ సంగతి జగమెరిగిన సత్యం. జగన్ కూడా పలుమార్లు తన ఇష్టాన్ని ప్రకటించారు కూడా. ఆమధ్య అసెంబ్లీ లాబీల్లో టీడీపీ నేతలతోనే జగన్ బాలయ్యపై తన అభిమానాన్ని వ్యక్తంచేశారు. టీడీపీ ఎమ్మెల్యేలందరిలోనూ బాలయ్యే బెస్టని కూడా జగన్ కితాబిచ్చారు అప్పుడు. రాజీకీయాలు వేరు సినిమాలు వేరు.. వ్యక్తిగత అభిమానాలు వేరు అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణగా చెబుతుంటారు. తాజాగా వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా జగన్ మాదిరిగానే వేరే పార్టీకి చెందిన హీరోను అభిమానిస్తున్నారు. అవును.. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అట.
తాను పవన్ కు వీరాభిమానినని అనిలే రీసెంటుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాటమరాయుడు సినిమా మొదటి రోజునే చూశానని... అందులో తప్పేముందని అన్నారు. పవన్ సినిమా బాగున్నా బాగులేకపోయినా చూడడం గ్యారంటీ అన్నారు. అంతేకాదు... అందరూ అట్టర్ ప్లాఫ్ అని చెప్పే జానీ సినిమాను తాను 9 సార్లు చూశానని అనిల్ అన్నారు.
జగన్ మాదిరిగానే అనిల్ కూడా రాజకీయాలు వేరు - సినిమాలు వేరు అని స్పష్టం చేయడంతో విమర్శకులు తమ నోళ్లను అదుపులో పెట్టుకున్నారు. అంతవరకు అనిల్ పై ఆరోపణలు చేసినవారంతా ఆయన ఓపెన్ గా తాను పవన్ అభిమానినని ప్రకటించుకోవడంతో సైలెంటయిపోయారు. ఇప్పుడున్న కాంగ్రెస్ - ఇతర పార్టీల సీనియర్ నేతల్లోనూ చాలామంది అప్పట్లో టీడీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసినా నటుడిగా మాత్రం ఎన్టీఆర్ ను అభిమానించేవారు. ఇప్పుడూ అంతే... యువ రాజకీయ నేతలు ఈ తరం నటులను అభిమానిస్తున్నారు.. వారు ఏ పార్టీలో ఉన్నా సినీ అభిమానం మాత్రం కొనసాగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/