దారుణం: రోగం నయం కాకుంటే పిల్లలను చంపేయడమే

Update: 2020-10-20 02:30 GMT
ముక్కుపచ్చలారని పిల్లల విషయంలో ఆ దేశం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఏ దేశమూ తీసుకొని అత్యంత క్రూరమైన నిర్ణయాన్ని నెదర్లాండ్ ప్రభుత్వం తీసుకుంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా నెదర్లాండ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై వైద్యరంగంలో తీవ్ర చర్చ జరుగుతోంది. తీవ్రమైన జబ్బుకు గురైన 12 ఏళ్ల లోపు పిల్లలు కోలుకునేందుకు అవకాశం లేకపోతే వారిని నిర్ధాక్షిణ్యంగా చంపేయాలని ఈ కొత్త చట్టం సూచిస్తోంది. నయం చేయలేని.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల జీవితాలను అంతం చేయడానికి నెదర్లాండ్ ప్రభుత్వం తాజాగా వైద్యులకు అనుమతిస్తూ ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది.

నయం కాని రోగాలతో కోమాలో లేదా... జబ్బు బడి ఆస్పత్రుల్లో చికిత్స పొందే పిల్లలను ఇక వైద్యులు చంపేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. దీనికోసం వైద్యులు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రతి సంవత్సరం నెదర్లాండ్ లో 5-10మంది పిల్లలు ఇలా ప్రభావితం అవుతున్నారని వారి విషయంలో ఏం చేయాలో తెలియక వైద్యులు, తల్లిదండ్రులు నరకయాతన పడుతున్నారని.. ఈ కొత్త చట్టంతో వారికి మరణం ఇవ్వడానికి ఆస్కారం లభిస్తుందని నెదర్లాండ్ ప్రభుత్వం తెలిపింది. ఇన్నాళ్లు ఇలా చేస్తే తీవ్ర నేరంగా పరిగణించేవారు. ఇప్పుడు ఈ చట్టంతో విముక్తి లభించనుంది.
Tags:    

Similar News