అవును..! నిజమే.. ఏపీలో నేతల తీరు ఇలానే ఉందట. నెటిజన్ల కామెంట్లు హోరెత్తుతున్నాయి. ఏపీ నేతలను నెటిజన్లు జోరుగా ఆడేసుకుంటున్నారు. దీనికి కారణం.. ఇక్కడి నాయకలకు ఇసుమంతైనా.. పౌరుషం లేదని.. వారికి కేవలం పదవులు.. పీఠాలు వ్యామోహం తప్ప.. మరేమీ అవసరం లేదని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఎందుకంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్తపార్టీ పెడుతున్నారు. తన టీఆర్ ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో ఆయన ప్రొజెక్టు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే ఇతర రాష్ట్రాల నాయకులను ఆయన కలిసి.. తనకు మద్దతు కోరారు. అలాగే దేశం లోని రైతులను తీసుకువచ్చి.. కాళేశ్వరం వంటివి చూపించి..తాను చేస్తున్న ప్రగతిని వివరించి.. దేశంలో తనకు అండగా ఉండాలని కోరారు.
ఈ క్రమంలోనే ఏపీపైనా కేసీఆర్ కన్నేశారు. ఇక్కడ తనకు కలసి వచ్చే నాయకులను ఆయన చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణం అయింది. నెటిజన్లు కేసీఆర్ ను ఏమీ అనడం లేదు.
ఏపీ నేతలపైనే విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ పిలిస్తే.. ఉండవల్లి అరుణ్‌కుమార్ తగుదునమ్మా అని ఇంటికి వెళ్లి మరీ.. మాట్లాడి వచ్చాడు. ఇక, మరికొందరు నాయకులు కూడా.. ఇదే పంథా అనుసరించారు. ఇక, ఇప్పుడు ఆయన పార్టీలో చేరేందుకు.. ఎప్పుడెప్పుడు ఆహ్వానం వస్తుందా.. అని కొందరు నాయకులు ఎదురు చూస్తున్నారు.
నిజానికి తెలంగాణ ఏర్పడిందే ఏపీపై ద్వేషంతోను.. ఏపీ నేతలపై కోపంతోను.. మరి అలాంటి ఏపీ వాళ్లను చేర్చుకునేందుకు కేసీఆర్ సిద్ధపడినా.. నాటి సంగతులు ఎలా మరిచిపోయారనేది నెటిజన్ల ప్రశ్న.
ఏపీ వాళ్లను ద్రోహులుగా.. నీచులుగా.. తెలంగాణ ప్రజల రక్తం తాగిన వారిగా.. కేసీఆర్ అభివర్ణించారు. అంతేకాదు.. ఏపీ ప్రజలను ఇప్పటికీ.. చేతకానివారిగానే చూస్తున్నారు. అలాంటి నాయకుడి చెంతకు వెళ్లేందుకుఎందుకంత ఉబలాటం.. అని కూడా ఏపీలో చర్చ జరుగుతోంది. కానీ. ఎవరు ఏమనుకున్నా.. మాకేంటి అనుకుంటున్నారో..ఏమో..ఏపీలోని రెండు మూడు పార్టీల నాయకులు.. కేసీఆర్ పిలుపు కోసం.. ఎదురు చూస్తున్నట్టుగానే పరిస్థితి ఉండడం గమనార్హం. దీనినే నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. మరి ఆ జంపింగ్ నాయకులు రేపు వెళ్లిపోతే.. ప్రజలకు ఏం చెబుతారు? అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.