ఇటీవల సూపర్ హిట్ కొట్టిన పుష్ప సినిమాలో పోలీసు అధికారి.. అల్లు అర్జున్ దగ్గర 'ఆ ఒక్కటి తక్కువైంది' అనే డైలాగు చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు అదే డైలాగు.. మంత్రి అంబటిని వుద్దేశించి నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ''అంబటి సర్.. మీరు ఎన్నయినా.. చెప్పండి.. ఆ ఒక్కటి తక్కువైంది!'' అని కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ.. అంబటి ఏం చెప్పారు.. నెటిజన్లు ఎందుకు కామెంట్లు చేస్తున్నారనేది పెద్ద కథే! చదివి తరిద్దాం.. పదండి!!
ఈ ఏడాది ఆగస్టు 20న సత్తెనపల్లిలో(అంబటి సొంత నియోజకవర్గం) ఓ హోటల్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు మృతిచెందారు. వారిలో వర్ణయ్య, గంగమ్మ దంపతుల కుమారుడు తురకా అనిల్(17) కూడా ఉన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వ పరిహారం రూ.5 లక్షలు మంజూరు చేసింది. ఇది ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుంది. అయితే.. దీనిని స్థానిక మునిసిపల్ చైర్మన్ భర్త సాంబశివరావుకు అందించారు ఎమ్మెల్యే.
ఎందుకంటే.. గంగమ్మ ఉండే ఇల్లు.. వీరి పరిధిలోనే ఉంది. సో.. ఆయన దగ్గరకు వెళ్లి చెక్కు తీసుకోవాలని గంగమ్మకు కబురు పెట్టారు. అయితే.. ఈ చెక్కు ఇవ్వాలంటే రూ.2.50 లక్షలు తమకు ఇవ్వాలని.. సాంబశివరావు.. అనిల్ తల్లిదండ్రులు తురకా వర్ణయ్య, గంగమ్మలను డిమాండ్ చేశారు. ఈ విషయమై వారు మంత్రి అంబటి వద్దకు వెళ్లి గోడు వినిపించారు.
దీనికి ఆయన కూడా ఔను.. రూ.2.50 లక్షలు ఇవాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ముఠా విషయాన్ని గంగమ్మ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ధూళిపాళ్లలో జరిగిన సభలో పవన్ ఈ అంశం ప్రస్తావించారు. మంత్రి అంబటిపై విరుచుకుపడ్డారు. దీనిని అంబటి ఖండిస్తూ.. ఈ ఆరోపణ నిరూపిస్తే రాజీనామా చేస్తా నని సవాల్ విసిరారు.
ఇదిలావుంటే, జనసేన ఆధ్వర్యంలో బాధితులు మంగళవారం సత్తెనపల్లిలో ర్యాలీ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. 'గతంలో ఎప్పుడూ మంత్రి అంబటిని కలవ లేదు. న్యాయం చేయాలని ఆయన వద్దకు వెళ్లాం. రూ.2.5 లక్షలు ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. అవి ఇస్తే నే సాంబశివరావు వద్దకు వెళ్లి చెక్కు తీసుకోమన్నారు'' అని గంగమ్మకన్నీరు పెట్టుకుంది.
కట్ చేస్తే..
ఈ గంగమ్మ విమర్శలపై అంబటి స్పందించారు. సెప్టిక్ ట్యాంక్ లో చనిపోయిన వారికి న్యాయం చేద్దామని ఆలోచించి ప్రభుత్వం నుంచి 5 లక్షల చొప్పున ఇప్పించానని తెలిపారు. అయితే, ఘటన జరిగిన సమయంలో సెప్టిక్ ట్యాంక్ ఉన్న వినాయక హోటల్ యజమాని నుంచి అప్పటికప్పుడు రెండున్నర లక్షలు పరిహారంగా ఇప్పించానని.. ఇప్పుడు దానినే తిరిగి ఇవ్వాలని కోరుతున్నానని.. ఇది ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఇది రాజకీయం చేస్తున్నారని.. ఆ రెండున్నర లక్షలతో నేనేమీ బిల్డింగ్ కట్టుకోనని చెప్పారు.
ఆ ఒక్కటి తక్కువ ఏంటంటే!
అంబటి చెప్పిన ఈ సంజాయిషీలో ఒక లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీనినే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అదేంటంటే.. ప్రభుత్వం పరిహారం ఇవ్వడం ఒక విధానం. అసలు ఈ సెప్టిక్ ట్యాంకు యాజమాన్యం నుంచి కూడా బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పించాలి. ఇదే అప్పట్లో అంబటి ఇప్పించానని చెప్పుకొన్నారు. తర్వత ప్రభుత్వం తరఫున ఇప్పించారు. కానీ, ఇప్పుడు ఈ రెండున్నర లక్షల వివాదం తెరమీదికి వచ్చేసరికి.. యాజమాన్యం నుంచి 'అప్పు'గా ఇప్పించినట్టు ఆయన చెబుతున్నారు. మరి బాధితులకు యాజమాన్యం నుంచి అప్పు ఇప్పించారా? లేక.. పరిహారం ఇప్పించారా? అనే లాజిక్ మిస్సవుతోందని అంటున్నారు. లేక తాము ఎలానూ దొరికిపోయాం కాబట్టి.. తప్పించుకుంటున్నారా? అనేది నెటిజన్ల ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.