‘అధికారం కోసమే పార్టీలు మారకూడదు’..ఇవి తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పిన నీతులు. అధికారమే పరమావధిగా నాయకులు పార్టీలు మారకూడదని బుద్దులు చెప్పటమే విచిత్రంగా ఉంది. చిన్నపిల్లలు బట్టలు మార్చుకున్నంత స్పీడుగా నేతలు పార్టీలు మారిపోతున్నారంటు వెంకయ్య ఆవేధన వ్యక్తంచేయటం ఆశ్చర్యంగానే ఉంది. జోధ్ పూర్ ఐఐటిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్ధి అడిగిన ప్రశ్నకు వెంకయ్య పై విధంగా సమాధానమిచ్చారు.
పార్టీ మారటం తప్పుకాదట కానీ సిద్ధాంతాలు మార్చుకున్నపుడే పార్టీలు మారాలంటు భేలే చెప్పారు. అందుకు విరుద్ధంగా అధికారం కోసమే పార్టీ మారటం మాత్ర తప్పని వెంకయ్య స్పష్టంగా చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వెంకయ్య చెప్పే మాటలకు చేసేపనికి ఏమాత్రం పొంతన లేదు. అలాగే నరేంద్రమోడి, అమిత్ షాలు చేస్తున్న పనులు వెంకయ్యకు కనబడటంలేదా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.
2019లో టీడీపీ ఘోరంగా ఓడిపోతే రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. వెంటనే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ్యులు టీడీపీ నుండి బీజేపీలోకి ఫిరాయించారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించింది వెంకయ్యనాయుడే. ఆ విషయాన్ని బహుశా వెంకయ్య మరచిపోయినట్లున్నారు. పార్టీ మారిన నలుగురు ఏ సిద్ధాంతాలతో టీడీపీ నుండి బీజేపీ లోకి మారారో వెంకయ్య చెప్పగలరా ? పార్టీ మారేవాళ్ళల్లో ఎవరి అజెండాలు వారికుంటాయి. మరి వాళ్ళని వెంకయ్య ఎలా చేర్చుకున్నారు ?
ఈ విషయాన్ని వదిలిపెడితే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎంఎల్ఏలను మోడి, అమిత్ షా లు బీజేపీలోకి చేర్చుకుంటున్నారు. కర్నాటక, సిఖ్ఖిం, గోవా లాంటి రాష్ట్రాల్లో ఎంఎల్ఏల బలం లేకపోయినా బీజేపీ అధికారంలోకి ఎలా వచ్చిందో వెంకయ్యకు తెలీదా ? పశ్చిమబెంగాల్ ఎన్నికల సమయంలో ఎంతమంది తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్ఏలను మోడి, షాలు బీజేపీలోకి లాక్కోవటాన్ని వెంకయ్య ఎందుకు అడ్డుకోలేదు ? పార్టీ ఫిరాయింపులకు అనుకూలంగా స్వయంగా మోడినే బహిరంగసభలో ప్రకటించిన విషయం వెంకయ్యకు తెలీదా ?
ఇపుడున్న పార్టీల్లో ఎన్నింటికి సిద్ధాంతాలున్నాయి ? అధికారంలోకి రావటమే ఏకైక సిద్ధాంతంగా మారిపోయింది కాబట్టే అధికారంలోకి రావటానికి అవకాశం ఉన్న ప్రతిపార్టీ అడ్డదారులు తొక్కుతోంది. దాదాపు 50 ఏళ్ళుగా యాక్టివ్ పాలిటిక్స్ లో వెంకయ్య రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను చూడటంలేదా ? ప్రలోభాలతో ఇతర పార్టీల ఎంపిలు, ఎంఎల్ఏలను బీజేపీలోకి చేర్చుకోవద్దని మోడికి చెప్పగలరా ? అంత ధైర్యం వెంకయ్యకు ఉందా అన్నదే అసలైన ప్రశ్న. స్వయంగా తానే ఆచరించలేని నీతులను విద్యార్ధులకు చెప్పటం ఎందుకో వెంకయ్యే ఆలోచించుకోవాలి.