సినిమా రంగానికి రాజకీయ రంగానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి అందరికి తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విశ్వనటుడు కమల్ హాసన్ పెట్టిన మక్కల్ నీది మయ్యం పార్టీ తన లక్ ను పరీక్షించుకోనుంది. ఇప్పటివరకు వెలువడిన అంచనాల ప్రకారం.. కమల్ పార్టీ పెద్దగా ప్రభావాన్ని చూపించే అవకాశం లేదంటున్నారు. అయితే. .కమల్ మాత్రం పార్టీ విజయంపై మహా నమ్మకంగా ఉన్నారు.
సినీ నటులు పార్టీ పెట్టటం.. పోటీ చేయటం.. ఓటమిపాలై సినిమాలకు వెళ్లిపోవటంలాంటివి చేస్తారంటూ వస్తున్న విమర్శలపై కమల్ స్పందించారు. తాను ప్రజలకు సేవ చేయటానికే సినిమాల్లోకి వచ్చానని.. ఒకవేళ తన రాజకీయాలకు సినిమాలు అడ్డుగా నిలిస్తే.. వాటిని మానేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేయటం.. అనంతరం సినిమాలకు గుడ్ బై చెబుతానని.. రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో ఓడితే.. సినిమాల్లోకి వెళతానని చెబుతున్నారు. అదెప్పటికి జరగదు. ఇప్పటివకే పలువురి నుంచి బెదిరింపులు వచ్చాయి. మహా అయితే ప్రాణం తీస్తారు.. నాకా భయం లేదు.. అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను ఎవరి బెదిరింపులకు భయపడనని.. రాజకీయాలే తన జీవితంగా అభివర్ణించారు. కమల్ మాటల్ని విన్నంతనే.. కొంతకాలం క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు గుర్తుకు రాక మానదు.
తాను పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేశానని.. సినిమాలు చేయనని చెప్పటం.. తాజాగా ఆయన సినిమాలు.. రాజకీయాలు రెండింటిని చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చే సినీ నటులు ఎవరూ కూడా పూర్తిగా పాలిటిక్స్ కు పరిమితం కాలేరన్న విషయం తరచూ నిరూపితమవుతున్న వేళ.. కమల్ చెబుతున్న మాటల్లో నిజం ఏమిటన్నది కాలమే తేల్చాలి.