ఏపీలో పీకే టీమ్‌కి చుక్క‌లు చూపిస్తున్న న్యూట్ర‌ల్ ప్ర‌జ‌లు

Update: 2022-09-12 13:30 GMT
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టి నుంచే దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. తాము అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని.. దేశంలో ఎక్క‌డా ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా అమ‌లు చేయ‌ని కార్య‌క్ర‌మాలు చేస్తున్నామ‌ని.. సో.. ప్ర‌జ‌లంతా త‌మ‌వైపే ఉంటార‌ని.. భావిస్తోంది. ముఖ్యంగా న‌వ‌ర‌త్నాల పేరుతో.. ప్ర‌జ‌ల‌కు ఇస్తున్న ఇళ్లు, ఇత‌ర‌త్రా ప‌థ‌కాలు త‌మ గ్రాఫ్‌ను పెంచాయ‌ని చెబుతోంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌పై భారీగానే ఆశ‌లు పెట్టుకుంది. అయిన‌ప్ప‌టికీ.. పాల‌న మూడేళ్లు పూర్తి చేసుకున్న ద‌రిమిలా.. ఎందుకైనా మంచిద‌ని.. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

దీనిలో భాగంగా.. ప్ర‌జ‌ల నుంచి ఏదో ఒక రూపంలో వారి అభిప్రాయాన్ని తెలుసుకుంటోంది. దీనికి ముఖ్యంగా రాజ‌కీయ వ్యూహ క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్(పీకే) బృందాన్ని వినియోగిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ పీకే టీంకు చెందిన ఐప్యాక్ బృందం రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరును.. ప్ర‌జ‌ల్లో వారికి ఉన్న ప్ల‌స్‌, మైన‌స్‌ల‌ను కూడా ఈ బృందం సేక‌రించింది. ఈ స‌ర్వేల్లో దాదాపు 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేల ప‌నితీరు స‌రిగా లేద‌ని కొన్ని రోజుల కింద‌ట ఐప్యాక్ టీం నివేదిక ఇచ్చిన విష‌యం తెలిసిందే.

దీంతో జ‌గ‌న్ ఆయా నేత‌ల‌ను ప్ర‌త్య‌క్షంగాను, ప‌రోక్షంగా కూడా హెచ్చ‌రించారు. ప్ర‌జ‌ల మ‌ద్య ఉండాల‌ని.. లేక‌పోతే.. వ‌చ్చే ఎన్ని క‌ల్లో టికెట్ కూడా క‌ష్ట‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేందుకు నాయ‌కులు ఇప్పుడిప్పుడే ముందుకు క‌దులుతున్నారు. ఇదిలావుంటే. స‌ర్వేలు మ‌రింత ముమ్మ‌రంగా సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు.. వైసీపీ అనుకూల వ్య‌తిరేక వ‌ర్గాల అభిప్రాయాల‌ను పీకే బృందాలు సేక‌రించాయి. దీని ఫ‌లితం ఆధారంగా పార్టీకి నివేదిక‌లు అందించాయి. అయితే.. తాజాగా ఈ బృందం.. త‌ట‌స్థ‌(న్యూట్ర‌ల్‌) ఓట‌ర్ల‌ను కూడా క‌లిసి న‌ట్టు త‌లిసింది.

త‌ట‌స్థ ఓట‌ర్లు.. వైసీపీ విష‌యంలోనూ.. ఆ పార్టీనాయ‌కులు, పాల‌న విష‌యంలోనూ.. ఎలా ఆలోచిస్తున్నారు?  ఏం చేస్తున్నా రు?  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ఓటేయనున్నారు? అనే కీల‌క విష‌యాల‌పై స‌ర్వే ప్ర‌ధానంగా దృష్‌టి పెట్టిన‌ట్టు తెలిసింది. అయితే.. ఈ స‌ర్వేలో త‌ట‌స్థ ఓట‌ర్లు.. ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో అభివృద్ధి లేక‌పోవ‌డం.. రాజ‌ధాని లేక‌పోవ‌డం.. పోల‌వ‌రం త‌దిత‌ర ప్రాజెక్టులు ముందుకు సాగ‌క‌పోవ‌డం.. వంటివాటిని వీరు ప్ర‌స్తావించిన‌ట్టు స‌మాచారం. అదేవిధంగా ర‌హ‌దారులు.. మౌలిక వ‌స‌తులు వంటివాటిని కూడా.. వారు ప్ర‌ధానంగా ప్ర‌శ్నించార‌ని తెలుస్తోంది.

ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌కాశం జిల్లాలో ఇటీవ‌ల పీకే బృందంలోని స‌భ్యులు గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి.. త‌ట‌స్థ ఓట‌ర్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించార‌ని స‌మాచారం. అక్క‌డ పెద్ద ఎత్తున ప్ర‌భుత్వం వీరు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసిన‌ట్టు వైసీపీలోనే ఓ వ‌ర్గం గుస‌గుస‌లాడుతోంది. మామూలుగా అయితే.. పీకే అని బోర్డు పెట్టుకోక‌పోయినా.. క‌లిసిన వాళ్లు మాత్రం ఫేస్‌బుక్‌లో వాళ్ల ప్ర‌చారం కోసం.. `మ‌మ్మ‌ల్ని పీకే టీం క‌లిసింది` అని పెట్టుకుంటున్నార‌ట‌. దీంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది. అయితే.. నిజానికి పీకే టీం ఈ స‌ర్వేను ర‌హ‌స్యంగా చేయాల‌ని.. ఇలా ఓపెన్‌గా చేస్తే.. ఎలా అని అంటున్నారు.  ఈ విష‌యం ఎలా ఉన్నా.. త‌ట‌స్థ ఓట‌ర్లు మాత్రం వ్య‌తిరేకంగా ఉండ‌డం పార్టీలో చ‌ర్చ‌కు దారితీస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News