లగ్జరీ హోటల్లోకి డాబుగా దిగింది..ఆర్డీవో అని చెప్పి సిబ్బంది వద్దే వసూళ్లు
డాబుకు దర్జాకు ఏ మాత్రం తీసిపోనట్లుగా వ్యవహరించిన ఒక మహిళ చేష్టలు షాకింగ్ గా మారాయి. తన అతి తెలివితేటలతో హోటల్ సిబ్బందికి చుక్కలు చూపించిన ఆమె.. తాను దిగిన హోటల్ సిబ్బంది వద్దే దాదాపు రూ.80వేల వరకు వసూళ్లకుపాల్పడటమేకాదు.. దగ్గర దగ్గర రూ.2 లక్షల వరకు బిల్లు పెండింగ్ పెట్టింది. డబ్బులు అడిగితే రివర్సులో చెలరేగిపోయిన ఆమెను ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో కీలేడీలు ఎక్కువ అవుతున్నా.. ఈ రేంజ్ లో మాత్రం కనిపించలేదన్న మాట వినిపిస్తోంది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
గుంటూరుకు చెందిన మహిళ ఒకరు ఖమ్మంలోని ఒక ఖరీదైన హోటల్ లో రూం తీసుకుంది. ఈ మార్చి 26న వాణి పేరుతో ఖమ్మంలోని విష్ణు రెసిడెన్సీ లాడ్జిలో గది తీసుకుంది. తనను తాను రిటైర్డ్ ఆర్డీవోనని.. తాను రిటైర్డ్ డీజీపీ నందన్ కుమార్ భార్యనని నమ్మబలికింది. పట్టణంలోని భూముల వ్యవహారంపై ప్రత్యేక అధికారిగా తాను ఖమ్మానికి వచ్చినట్లుగా పేర్కొంది. హోటల్ బిల్లు పే చేయని ఆమె.. తన భర్త విదేశాల్లో ఉన్నారని.. తిరిగి రాగానే డబ్బులు చెల్లిస్తానని పేర్కొన్నారు.
అక్కడితో ఆగని ఈ కిలేడీ.. హోటల్ సిబ్బంది వద్దే మాటలు చెప్పి రూ.80వేల వరకు నగదు సాయాన్ని పొందారు. మరోవైపు వారాల తరబడి హోటల్ రూంలో ఉన్న ఆమె వైఖరితో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది డబ్బులు అడిగారు. అయితే.. తన భర్త విదేశాల నుంచి రాగానే తిరిగి బిల్లు చెల్లిస్తానని చెప్పింది. అలా చెప్పిన తర్వాత కూడా కాలం గడవటమేకానీ అద్దె డబ్బులు తిరిగి ఇవ్వని పరిస్థితి. దీంతో విసిగిపోయిన హోటల్ వారు ఆమెనుతాజాగా నిలదీశారు.దీంతో.. ఆమె గేరు మార్చి.. రివర్సులో వారిపై విరుచుకుపడి..వారిపై బెదిరింపులకు పాల్పడటంతో లాడ్జి వారు షాక్ కు గురయ్యారు.
ఇదిలా ఉంటే.. హోటల్ గదిని శుభ్రంచేసే క్రమంలో ఆమెకు సంబంధించిన షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఆమె రూంలో లభించిన ఆధార్ కార్డులో ఆమె పేరు విజయలక్ష్మిగా.. ఆమెది గుంటూరు జిల్లాగా తేలటంతో పాటు.. ఆమెది మంగళగిరి అన్న విషయాన్ని గుర్తించారు. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాడ్జి బిల్లు ఏకంగా రూ.1.8 లక్షలు కాగా.. సిబ్బందికి రూ.80వేల వరకు ఇవ్వాల్సినట్లుగా తేలింది. గతంలోనూఆమె ఇదే రీతిలో పలువురిని మోసిగించినట్లుగా గుర్తించారు. తాను ఐఏఎస్ అధికారినని బిల్డప్ ఇస్తూ మోసం చేస్తుందని పేర్కొన్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.