అమెరికా కల్లోలం: 24 గంటల్లో 52000 కొత్త కేసులు

Update: 2020-07-02 15:30 GMT
అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా మరోసారి విజృంభిస్తోంది. దీన్ని అరికట్టలేక అధ్యక్షుడు ట్రంప్ కూడా పుట్టించిన చైనాపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

కరోనా వైరస్ తాజాగా అమెరికాలో రికార్డులు బద్దలు కొట్టింది. గడిచిన 24 గంటల్లోనే అమెరికాలో ఏకంగా 52000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక రోజులో నమోదైన అత్యధిక కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 26 లక్షలు దాటింది. మరణించిన వారి సంఖ్య 1.28 లక్షలకు చేరింది.  టెక్సాస్, కాలిఫోర్నియా , ఫ్లోరిడాతో సహా కొన్ని రాష్ట్రాల్లో  జూన్ నెలలో రెట్టింపు అయ్యాయి. టెక్సాస్, అరిజోనా ప్రావిన్స్ లోని నగరాల్లో ఆస్పత్రుల్లో పడకలు తక్కువగా పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఈ కరోనా అంటు వ్యాధి అదుపులోకి వచ్చేలా కనిపించడం లేదని అమెరికా అతిపెద్ద కరోనా నిపుణుడు డాక్టర్ అంథోని ఫాసి చెప్పారు. సంక్రమణ ప్రమాదం దేశం మొత్తం ఆందోళనకు గురిచేసింది.  రాబోయే రోజుల్లో రోజూ లక్షమంది రోగులకు సోకననున్నట్లు ఆయన హెచ్చరించారు.
Tags:    

Similar News