తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు హడావుడి కొద్దిరోజులుగా సాగుతున్న సంగతి తెలిసిందే. దసరా నాటికి కొత్త జిల్లాల కసరత్తు పూర్తి చేయాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు ఇందుకు అనుగుణంగా అడుగులు చకచకా పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొత్త జిల్లాలు.. మండలాలపై తమ ప్రతిపాదన ముసాయిదాను సిద్ధం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి ఇచ్చారు. ఈ నెల 22న ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు.. కొత్తగా 14 జిల్లాల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్తగా 13 జిల్లాల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా చెప్పినప్పటికి ముసాయిదా ప్రతిని ముఖ్యమంత్రిచేతిలో పెట్టేసరికి.. 13 జిల్లాలు కాస్తా 14 జిల్లాలుగా మారటం గమనార్హం.
అదే సమయంలో ముఖ్యమంత్రి కుమారుడు కమ్ మంత్రి అయిన కేటీఆర్ అభీష్టం మేరకు సిరిసిల్లను జిల్లాగా చేయాలన్న ప్రతిపాదన విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని చెప్పినా.. చివరకు అలాంటిదేమీ లేదని తేలింది. కేటీఆర్ కోరుకున్నట్లుగా కొత్త జిల్లా ఏర్పాటు సాధ్యం కాదని అధికారుల బృందం అభిప్రాయపడటం.. విపక్షాలు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్న వేళ.. ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు.
తాజాగా తయారు చేసిన ముసాయిదా తీర్మానంతో కొత్త జిల్లాలు పద్నాలుగుగా నిర్ణయించటంలో మొత్తం జిల్లాలు 24 కానున్నాయి. సిరిసిల్లకు తుది జాబితాలో స్థానం దక్కకుంటే.. అనూహ్యంగా జాబితాలోకి నిర్మల్ రావటం గమనార్హం. తాను గూగుల్ మ్యాప్ ను పరిశీలించినప్పుడు నిర్మల్ జిల్లా ఏర్పాటు అవసరాన్ని గుర్తించానని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా చెబుతున్నారు.
తొలుత నిర్మల్ జిల్లాగా ప్రతిపాదన లేనప్పటికీ.. గూగుల్ లో పరిశీలించిన తర్వాత నిర్మల్ జిల్లాగా ఏర్పాటుచేయాల్సిన అవసరాన్ని తాను గుర్తించినట్లుగా అధికారులతో కేసీఆర్ చెప్పినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ నిర్మల్ ప్రాంతానికి మేలు జరగకుండా అది అన్యాయమే అవుతుందని ఆయన అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. ముసాయిదా ప్రతిపాదనను వెల్లడించిన తర్వాత మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏది ఏమైనా దసరా నాటికి (అక్టోబరు 11న) కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయమని చెబుతున్నారు. తాను ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కేటీఆర్ ఎంతగా తపించినా.. సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకోవటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుండటం గమనార్హం.
సీఎస్ కమిటీ సీఎంకు ఇచ్చిన కొత్త జిల్లాలతో కూడిన తెలంగాణ మొత్తం జిల్లాలు చూస్తే..
1. హైదారాబాద్
2. సికింద్రాబాద్ (కొత్త జిల్లా)
3. రంగారెడ్డి
4. మహబూబ్ నగర్
5. నాగర్ కర్నూలు (కొత్త జిల్లా)
6. వనపర్తి (కొత్త జిల్లా)
7. కరీంనగర్
8. జగిత్యాల (కొత్త జిల్లా)
9. అదిలాబాద్
10. కొమురంభీమ్(మంచిర్యాల) (కొత్త జిల్లా)
11. నిర్మల్ (కొత్త జిల్లా)
12. నిజామాబాద్
13. కామారెడ్డి (కొత్త జిల్లా)
14. ఖమ్మం
15. భద్రాద్రి (కొత్తగూడెం) (కొత్త జిల్లా)
16. సంగారెడ్డి (కొత్త జిల్లా)
17. మెదక్
18. సిద్ధిపేట (కొత్త జిల్లా)
19. నల్గొండ
20. సూర్యాపేట (కొత్త జిల్లా)
21. యాదాద్రి (కొత్త జిల్లా)
22. వరంగల్
23. మహబూబాబాద్ (కొత్త జిల్లా)
24. జయశంకర్ (భూపాలపల్లి) (కొత్త జిల్లా)