ఆ రాష్ట్రం చర్చిల పై నిఘా పెట్టిందా?

Update: 2021-10-27 07:38 GMT
బీజేపీ ఏలుబడిలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కొత్త రచ్చ మొదలైంది. రాష్ట్రంలోని చర్చిల కార్యకలాపాల మీద నిఘా నేత్రం వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. చర్చిల ఆస్తులు.. వాటి ఆర్థిక స్థితిగతులతో పాటు.. వాటికి నిధులు ఎలా వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? లాంటి అంశాల మీద నిఘా వర్గాలు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. ఇందుకోసం నిఘా వర్గాన్ని రంగంలోకి దింపినట్లుగా చెబుతున్నారు.

రాష్ట్రం లో చర్చిల కు సంబంధించిన రివ్యూ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు గా వార్తల రావటం తో క్రైస్తవ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. ఈ కథనాలు పూర్తి గా అవాస్తవమంటూ చెబుతున్నారు. ఇది లా ఉంటే.. నవంబరు ఏడున ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన సారాంశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని చర్చిలకు సంబంధించిన సమీక్ష చేపట్టాలన్న ఆదేశాల్ని గుర్తు చేస్తున్నారు.

దీనికి సంబంధించిన రగడ ముదురుతుందన్న విషయాన్ని గుర్తించిన రాష్ట్ర హోం మంత్రి రంగంలోకి వచ్చారు. జరుగుతున్న ప్రచారం పై ఆయన వివరణ ఇచ్చారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చర్చిలకు గ్రాంట్లు విడుదల చేసేందుకు ఈ సమీక్షను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందు లో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. చర్చిల కార్యకలాపాల పై ఎలాంటి నిఘా విధించలేదన్న ఆయన.. దీనికి సంబంధించి వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
Tags:    

Similar News