కాలానికి తగ్గట్లు.. గుళ్లో తీర్థానికి కొత్త పద్దతిని తెచ్చేశారు
అవసరానికి తగ్గట్లు తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మార్చేసుకోవటమే కాదు.. అందుకు తగ్గట్లు తనను తాను మారే విషయంలో మనిషికి మించినోడు ఉండదు. మాయదారి రోగం విరుచుకుపడుతున్న వేళ.. ఎన్నో పరిమితులు మనిషి జీవితంలోకి వచ్చేశాయి. ఒక విధంగా చూస్తే.. మనిషి జీవితం బీసీ (బిఫోర్ కరోనా).. ఏసీ (ఆఫ్టర్ కరోనా) గా మారిపోయింది.
సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ రోజంతా బిజీబిజీగా ఉండేటోళ్లు. ఇంటికి విశ్రాంతికి మాత్రమే వచ్చే పరిస్థితి. మహమ్మారి పుణ్యమా అని పరిస్థితి మారిపోయింది. ఇల్లే దేవాలయంగా మారింది. ఇల్లు విడిచి కాలు బయటకు పెడితే.. అంతకు మించిన ముప్పు మరొకటి లేదనే రోజుల్లోకి వచ్చేశాం. ఇలాంటివేళ.. చాలామంది జీవితాల్లో కీలకమైన గుడి కూడా దూరమైంది. అన్ లాక్ 1.0లో భాగంగా దేవాలయాలు తెరుచుకున్నా.. గుళ్లో ఇచ్చే తీర్థం బంద్ అయ్యింది. దీంతో గుడికి వెళ్లటం ఆనందాన్ని కలిగించినా.. తీర్థ ప్రసాదాలు లేని లోటు చాలామందిలో ఈ కొరతను తీర్చేందుకు కర్ణాటకలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు తమదైన రీతిలో పరిష్కారాన్ని కనుగొన్నారు. గుళ్లో ఇచ్చే తీర్థం తో వైరస్ వ్యాప్తికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో దానిపై పరిమితులు పెట్టిన నేపథ్యంలో.. అందుకు చెక్ చెబుతూ సెన్సర్ ఆధారంగా పని చేసే తీర్థం మిషన్ ను చౌక ధరతో తయారు చేశారు. ఉడుపి జిల్లాలోని నిట్టె మహాలింగ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన ఈ మిషన్ ఎలా పని చేస్తుందంటే.. దైవ దర్శనం తర్వాత సదరు మిషన్ కింద చేతిని జాచితే.. కాస్తంత తీర్థం చేతిలోకి పడుతుంది.
సింఫుల్ గా చెప్పాలంటే.. చాలా హోటళ్లలో.. రెస్టారెంట్లలో సెన్సర్ ఆధారంగా పని చేసే ట్యాపులు కనిపిస్తాయి కదా. ఆ సాంకేతికతను అందిపుచ్చుకొని.. తీర్థం మిషన్ గా తయారు చేశారు. తాము తయారు చేసిన యంత్రాన్ని కాలేజీ ఆవరణలో ఉన్న మహాగణపతి గుడిలో ఏర్పాటు చేశారు. దీంతో.. ఈ తీర్థం మిషన్ పలువురిని ఆకర్షిస్తోంది. చేయి చాచిన వెంటనే.. చేతిలోకి ఐదు నుంచి పది ఎంఎల్ తీర్థం వస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి మిషన్ అర్చక అన్న పేరును పెట్టారు. రాస్ట్ర వ్యాప్తంగా ఉన్న గుళ్లలో దీన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. కర్ణాటక సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.