తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వేడి రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎప్పట్లాగే హవా సాగించాలని అధికార పార్టీ ఎత్తులు వేస్తుంటే...సత్తా చాటుకోవాలని టీడీపీ-బీజేపీ కూటమి - కాంగ్రెస్ - ఎంఐఎం పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా తెలంగాణ పేరుతో తెరమీదకు వచ్చిన పార్టీలపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.
తాజాగా వెలువడిన పలు వివరాల ప్రకారం తెలంగాణ రాష్ర్ట ఎన్నికల సంఘం వద్ద నమోదైన పార్టీల్లో 12 పార్టీలు తెలంగాణ పేరుతో ఉన్నాయి. ఇందులో పలు పార్టీలు అధికార తెలంగాణ రాష్ర్ట సమితికి దగ్గరగా ఉండటం, అదే సిద్ధాంతాలతో ఉండటం గమనార్హం. తెలంగాణ రాజ్య సమితి పార్టీ - తెలంగాణ సకల జనుల పార్టీ - తెలంగాణ ఐక్య జన పార్టీ వంటివి తెలంగాణవాదుల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ - తెలంగాణ లోక్ సత్తా పార్టీ - తెలంగాణ యువసేన పార్టీ - తెలంగాణ యువశక్తి పార్టీ - తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ - తెలంగాణ డెమోక్రటిక్ పార్టీ వంటివి కూడా ఇదే నినాదంతో ఉన్నాయి.
తెలంగాణ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీల విషయం పక్కనపెడితే...తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వినిపించిన పదాలైన సకల జనులు - తెలంగాణ ఐక్య కార్యచరణ సమితి పేరుతో ఏర్పాటుచేసిన పార్టీల వెనుక ఎవరున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. ఉద్యమకాలంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వెంట నడిచిన పలువురు నాయకులు వివిధ కారణాలతో ఆయనకు గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో సదరు నేతలు ఈ పార్టీల వెనుక ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.