దేశంలో మరోసారి కరోనా కలకలం వైరస్ కలకలం రేపుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ లో భారత్లోనూ బయటపడ్డాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ 4, బీఏ 5 లు అత్యంత వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్య పరిశోధకులు గుర్తించారు.
ఇవి దేశంలో బయటపడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన వాటి కంటే ఇవి అత్యంత వేగంగా విస్తరిస్తాయని, అయితే అంత ప్రమాదకరమైనవి కాదని అంటున్నారు. కానీ ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను భట్టి వైరస్ రూపాంతరం చెందే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అయితే ఈ వైరస్ సోకినవారిలో సల్ప లక్షణాలే ఉన్నట్లు గుర్తించారు. కానీ ముందు జాగ్రత్తగా చర్యలు ప్రారంభించారు.
ఇన్సాకాగ్ అనే సంస్థ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం తమిళనాడులోని 19 ఏళ్ల యువతిలో బీఏ 4 ఉపవేరియంట్ బయటపడింది. అలాగే తెలంగాణలోని సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి శాంపిల్ పరిశీలించగా ఇదే రకమైన సబ్ వేరియంట్ ను గుర్తించారు. ఇక తెలంగాణకు చెందిన 80 ఏళ్ వ్యక్తి శరీరంలో బీఏ 5 ని కనుగొన్నారు.
ఈయనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అయినా ఆయన శరీరంలో ఈ సబ్ వేరియంట్ ను గుర్తించినట్లు ఇన్సాకాగ్ తెలిపింది. మరోవైపు వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి కావడంతో ఈ వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలున్నాయని తెలిపింది.
ఒమిక్రాన్ లోని సబ్ వేరియంట్లుగా పేర్కొంటున్న బీఏ 4, బీఏ 5 ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. అయితే ప్రధాన వేరియంట్ కంటే ఇది పెద్ద ప్రమాదమేమీ కాదని అంటున్నారు. అయినా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు వైద్యులు తెలుపుతున్నారు. కానీ సామాజిక వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య సంస్థ తెలిపింది. అందువల్ల జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని పేర్కంటున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ప్రపంచ మంతా సోకిందని, అయితే వ్యాక్సినేషన్ తో దీనిని తట్టుకుంటున్నాయంటున్నారు.
ఇదిలా ఉండగా దేశంలో ఇప్పటి వరకు దాదాపు 100 శాతం టీకా పూర్తి చేయడం వల్ల కొత్త వేరియంట్లను తట్టుకునే శక్తి ఉందని అంటున్నారు. ప్రస్తుతం సమీపిస్తోన్న సబ్ వేరియంట్లతో మూడు టీకాలు వేసుకున్న వారికి ఎలాంటి ముప్పు లేదంటున్నారు. అయితే వేరియంట్లు వాతావరణ పరిస్థితులను భట్టి మారే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా దీర్ఘాకాలిక వ్యాధిగ్రస్తులు, అనారోగ్యం ఎక్కువగా ఉన్నవారు జాగ్రత్తలు పాటించాల్సిందేనంటున్నారు.