టీడీపీలో కొత్త జోష్‌.. పెరిగిన నేత‌ల స‌ఖ్య‌త రీజ‌నేంటి?

Update: 2023-01-19 02:30 GMT
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లొసుగులు, అసంతృప్తులు తొలిగిపోతున్నాయా?  నాయ‌కులు చేతులు క‌లుపుతున్నారా?  పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారా?  నాయ‌కులు క‌లుసుకుంటున్నారా?  విభేదాల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారుప‌రిశీల‌కులు. పార్టీలో ఒక ర‌కంగా చెప్పాలంటే.. యువ నాయ‌కుడు మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్ట‌నున్న 'యువ‌గ‌ళం' పాద‌యాత‌పై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. ఈ యాత్ర‌ను ఎక్క‌డిక‌క్క‌డ స‌క్సెస్ చేయ డం ద్వారా.. త‌మకు గుర్తింపు తెచ్చుకునేలా నాయ‌కులు కృషి చేస్తున్నారు.

తాజాగా టీడీపీలో 'యువగళం' పాదయాత్ర సందడి మొదలైంది. ఈ క్ర‌మంలో ఉండవల్లిలో లోకేష్‌ను కలిసిన పలువురు టీడీపీ నేతలు పాదయాత్రకు మద్దతు తెలిపారు. అలాగే పార్టీలోని అన్ని ప్రాంతాల నేతలు లోకేష్‌ను కలిసి పాదయాత్రకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. కుప్పం నుంచి ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే యువగళం పాదయాత్రపై నేతలు చర్చించారు.

మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చిన రాజప్ప, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ తదితరులు లోకేష్ ను క‌లిసి త‌మత‌మ ప్రాంతాల‌కు సంబంధించిన రూట్ మ్యాప్‌ను తీసుకున్నారు.

ఈ సందర్భంగా తన పాదయాత్ర వివరాలను లోకేష్ వారితో పంచుకున్నారు. మద్దతు తెలిపిన నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతల మద్దతు, సహకారంతో... ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా 'యువగళం' పాదయాత్ర నిర్వహిస్తానని లోకేష్ వారితో అన్నారు.

ఇదిలావుంటే,.. ఈ నెల 27న చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం నుంచి ప్రారంభ‌మ‌య్యే.. యువ‌గ‌ళం పాద‌యాత్ర 4000 కిలో మీట‌ర్ల మేర‌కు 400 రోజులు సాగ‌నుంది. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వ‌ర‌కు ఈ యాత్ర ముందుకు సాగుతుంది. ఇక‌, దీనికి సంబంధించి ప‌క్కా రోడ్ మ్యాప్‌ను కూడా పార్టీ రెడీ చేసుకుంది.

వాస్త‌వానికి ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో 1 ఇబ్బంది అవుతుంద‌ని భావించిన‌ప్ప‌టికీ.. దానిని ప‌ట్టించుకోకుండానే లోకేష్ తొలిరోజు  యువ‌గ‌ళానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌ను ఇటీవ‌ల ఇచ్చారు. దీని ప్ర‌కారం.. తొలిరోజు 60 నిమిషాల పాటు.. బ‌హిరంగ స‌భ‌, రోడ్ షో కూడా అందులో ఉన్నాయి. ఇదిలావుంటే.. పార్టీ నాయ‌కులు క‌లిసి రావాల‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని.. ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. దీంతో నేత‌లు విభేదాలు క‌ట్టిపెట్టి.. పాద‌యాత్ర‌కు ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News