అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ పక్కనే ఉన్న పోలాండ్ కి వెళ్లారు. ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై కఠిన ఆంక్షలు విధించిన బైడెన్... ప్రస్తుతం రష్యా పొరుగు దేశం పోలాండ్ లో పర్యటించడం ప్రధాన అంశంగా మారింది. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోలాండ్ దేశంలోని ర్జెస్జో ప్రాంతంలోని నాటో సైనికులతో పాటు ఉక్రెయిన్ శరణార్థులను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా అమెరికా ఆర్మీ యొక్క 82వ వైమానికి విభాగానికి చెందిన సైనికులతో బైడెన్ పార్టీ చేసుకున్నారు. వారితో కలిసి సెల్ఫీలు దిగుతూ... పిజ్జాలు తిన్నారు. చాలా సేపు వారితో ముచ్చటించిన అమెరికా దేశాధ్యక్షుడు బైడెన్... అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ యుద్ధ నేరస్తుడని మరోసారి విమర్శన అస్త్రాలు సంధించారు.
అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అగ్ర రాజ్య దేస అధ్యక్షుడు యుద్ధ ప్రాంతానికి దగ్గరగా వెళ్లడం, యుద్ధం కారణంగా నష్టపోయిన వారిని కలుసుకోవడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం పోలాండ్ లో సుమారు 20 లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థులు ఉన్నారు. ఉక్రెయిన్ శరణార్థుల గురించి పోలాండ్ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాను అడిగి అమెరికా అధ్యక్షుడు బైడెన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
యుద్ధం కారణంగా శరణార్థులు తీవ్రంగా నష్టపోయారు అని, వారంతా తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆండ్రెజ్ వివరించారు. అంతే కాకుండా ఆర్థికంగా, మానసికంగా ఎంతో కుంగిపోయిన ఉన్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలాండ్ అధ్యక్షుడు తో కలిసి బైడెన్ శనివారం క్రేనియన్ శరణార్థులు, యూఎస్ మానవతా సహాయ వాలంటీర్లను కూడా కలుసుకున్నారు.
మాకు చేతనైన సాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. గుండె ను దిటువు చేసుకొని అందరూ హాయిగా జీవించాలని తెలిపారు. ఇప్పటివరకూ మీకు జరిగిన నష్టం పూడ్చలేనిది అయిప్పటికీ... ఇక నుంచి అయినా మీరంతా భయాందోళనలు పక్కన పెట్టి సంతోషంగా గడపాలని కోరుకుంటున్నట్లు బైడెన్ తెలిపారు.
అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీడియాతో మాట్లాడారు. యుద్ధం జరుగుతున్న సమయంలో భద్రతా కారణాల వల్ల ఉక్రెయిన్ కు వెళ్లలేక పోయినందుకు బాధ పడ్డానని తెలిపారు. అందుకు ఉక్రెయిన్ ప్రజలు తనను క్షమించాలని కోరారు. ఉక్రెయిన్ శరణార్థులను ఆదుకోవడంలో పోలాండ్ దేశం మానవతా దృక్పథం ప్రదర్శించడం అభినందనీయమని బైడెన్ తెలిపారు.
పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన శరణార్థులను ఆదుకోవడంలో ర్జెస్జో ప్రాంతం మానవతా సహాయానికి ప్రధాన కేంద్రంగా మారిందని బైడెన్ అన్నారు. పుతిన్ దూకుడు యూరప్ లో విధ్వంసం సృష్టించిందని ఉక్రెయిన్ ను జయించాలనే రష్యా ఆశయాలను చెదర గొట్టాలని పిలుపునిచ్చారు. అంతే కాదండోయ్ ఉక్రెయిన్ కు తన వంతు సాయంగా మరొక బిలియన్ డాలర్లు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ దేశాధ్యక్షుడు బైడెన్ ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే అమెరికా అధ్యక్షుడు చేస్తున్న సహాయానికి చాలా మంది మద్దతు తెలుపుతున్నారు.