థర్డ్ వేవ్ లేదు.. డోంట్ వర్రీ!

Update: 2021-08-23 14:30 GMT
కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన కొత్తలో ఈ మహమ్మారి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత రోజులు గడిచేకొద్ది అయినవారి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే కరోనా మహమ్మారి గజగజ వణికిపోయారు. ఇక కరోనా తగ్గిపోయిందిలే మళ్లీ పాత రోజులు తిరిగి వస్తాయి అనుకునే సమయంలో రెండో వేవ్ వచ్చింది. అలాగే రకరకాల ఫంగస్ లు వెలుగులోకి వచ్చాయి. ఇక రెండో వేవ్ లో ఎంత బీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఈ మధ్యనే సెకండ్ వేవ్ తగ్గింది అని అనుకునే సమయంలోనే మళ్లీ మూడో వేవ్ గురించి వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

కొందరు కరోనా మూడో వేవ్ ముంచుకొస్తుంది అంటుంటే , మరోవైపు మూడో వేవ్ ఏం లేదు భయపడకండి అని చెప్తున్నారు. కరోనా థార్డ్‌ వేవ్‌ ఆలోచన కూడా రాకూడదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. మూడో ముప్పు రాదని, అయినా ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా థార్డ్‌ వేవ్‌ వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో కరోనా ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైన్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్నది.

ఈ సందర్భంగా ఖైరతాబాద్‌ ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌లో వ్యాక్సినేషన్‌ ను సీఎస్‌ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. నగరంలోని 4846 కాలనీల్లో టీకా తీసుకోని వారి గుర్తిస్తున్నామని చెప్పారు. జీహెచ్‌ ఎంసీలోని ప్రతి కాలనీకి సంబంధించిన షెడ్యూల్‌ తయారు చేశామని తెలిపారు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన ఇంటికి నీరి రంగు స్టిక్కర్‌ అతికిస్తున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ వల్ల చాలా మంది టీకా వేయించుకోవాడికి వస్తున్నారని చెప్పారు.

భయం వల్లే చాలా మంది టీకాకు దూరంగా ఉన్నారని చెప్పారు. వ్యాక్సినేషన్‌ పూర్తయిన కాలనీలకు పత్రాలతోపాటు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. 15 రోజుల్లో ప్రతి వ్యక్తికి ఒక డోసు టీకా పూర్తిచేస్తామన్నారు. నగరంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ పూర్తయిన తర్వాత రాష్ట్రమంతటా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపడతమన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం చేయడంలేదు అన్నారు.


Tags:    

Similar News