ఎక్కడో ఆస్ట్రేలియాలో నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటిదాకా ఉన్నారు. ఆయన సొంత నియోజకవర్గంలో హోరా హోరీగా మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోంది. అయినా ఆయన తనకేమి పట్టదన్నట్లుగా విదేశానికి విమానమెక్కేశారు. పోని అక్కడైనా సైలెంట్ గా ఉన్నారా అంటే అదీ కాదు, తానొచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలిచేనా ఏమైనా మ్యాజిక్ జరిగేనా అని కోమటిరెడ్డి బాగానే దీర్ఘాలు తీశారు.
అలా తాను ఎంపీగా ఉన్న పార్టీని భీకరమైన ఉప ఎన్నికల వేళ చేయాల్సిన డ్యామేజి చేశారు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే తన సొంత తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు బరిలో ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎటూ తమ్ముడు గెలుస్తాడులే, మధ్యన తాను కాంగ్రెస్ లో ఉండి ఎందుకు అటూ ఇటూ మనసు కాకుండా చేసుకోవడం అని సేఫ్ జోన్ అన్నట్లుగా ఆస్ట్రేలియాకు వెళ్ళిన బిగ్ బ్రదర్ ఇపుడు సడెన్ గా పోలింగ్ కి ముందే ల్యాండ్ అయిపోయారు.
ఆయన ఎందుకు వచ్చారు అంటే దాని మీద రకాలుగా ప్రచారం సాగుతోంది. తమ్ముడుకి ఆదిలో అంతా అనుకూలమే అనుకుంటే ఇపుడు సీన్ కాస్తా రివర్స్ అయింది అంటున్నారు. ఆయన అందుకే వచ్చి తమ్ముడికి అండగా నిలబడతారు అంటున్నారు. పోలింగ్ వేళ కాస్త తాను అండగా ఉంటే అటు నుంచి ఇటు నరుక్కురావచ్చు అనే ఆయన ఫీల్డ్ లోకి దిగారు అని అంటున్నారు.
నల్గొండ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డికి మునుగోడులో మొత్తం కాంగ్రెస్ నాయకులతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల వేళ ఎందుకు అనవసరంగా కాంగ్రెస్ వైపు ఉండడం బీజేపీకి ఓటు వేయడమే మంచిదంటూ ఆయన చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక ఎటూ ఆయన కాంగ్రెస్ కి చెడ్డ అనిపించుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ షఒకాజ్ నోటీస్ ఇచ్చేసింది. దాంతో దానికి సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా చర్యలు ఉంటాయి కాబట్టి వెంకటరెడ్డి తన సత్తా ఏంటి అన్నది చూపిస్తారు అని అంటున్నారు. మొత్తానికి సరైన టైం లో వచ్చిన అన్న గారు తమ్ముడు కళ్లలో ఆనందం చూస్తారా. ఏమో ఎన్నికలు జరిగేంతవరకూ ఉగ్గబట్టి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.