అందరూ వదిలేసిన వేళ.. వారికి అండగా నిలిచిన రేవంత్.. బెయిల్ తో బయటకు తెచ్చారు
మాటలు చెప్పే నేతలకు.. వరాలు కురిపించినట్లుగా హామీలు ఇచ్చే అధినేతలకు కొదవ ఉండదు. ఎవరిదాకానో ఎందుకు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతే తీసుకుంటే.. కేంద్రంలోని మోడీ సర్కారు మీద యుద్ధం ప్రకటించిన ఆయన.. ఈ మధ్యన తీసుకొచ్చిన అగ్నిపథ్ విధానంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. మోడీ సర్కారు తీరుకు నిరసనగా తెలంగాణ చోటు చేసుకున్న ఆందోళన.. ఈ సందర్భంగా జరిగిన హింస.. పోలీసుల కాల్పులు.. మొత్తం పెను సంచలనంగా మారటం తెలిసిందే.
పోలీసుల కాల్పుల్లో మరణించిన కుటుంబానికి భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించిన కేసీఆర్.. ఆందోళనల్లో పాల్గొన్న వారికి అండగా నిలుస్తామని చెప్పటం తెలిసిందే. కట్ చేస్తే.. అగ్నిపథ్ ఆందోళనల్లో జైలుపాలైన ఎంతో మందిని తర్వాత ఎవరూ పట్టించుకున్నది లేదు. హింసకు పాల్పడినవారు కొందరు చల్లగా జారుకుంటే.. శాంతియుత మార్గంలో ఆందోళన చేసిన అడ్డంగా బుక్ అయిన వారు బోలెడంత మంది ఉన్నారన్న వాదన వినిపించటం తెలిసిందే.
ఇలా అడ్డంగాబుక్ అయి జైల్లో మగ్గుతున్న పలువురికి బెయిల్ పొందే విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సాయంగా నిలిచారని చెప్పాలి. అగ్నిపత్ ఆందోళనకారులకు తాజాగా బెయిల్ మంజూరు కావటంతో రేవంత్ కీలక భూమిక పోషించటంతో పాటు.. ఆయన చొరవతోనే వారికి బెయిల్ వచ్చిందంటున్నారు. అగ్నిపథ్ ఆందోళనల్లో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన వైనం తెలిసిందే. దీంతో.. వారితో ములాఖత్ అయిన రేవంత్ వారికి తగిన సాయం అందిస్తానని చెప్పటం తెలిసిందే.
ఇచ్చిన మాటకు తగ్గట్లే.. ఆందోళనకారుల కోసం గాంధీ భవన్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన రేవంత్.. అందుకు తగ్గట్లే వారికి అవసరమైన న్యాయ సహకారాన్ని అందించారు. దీంతో.. తాజాగా వారికి బెయిల్ మంజూరు కావటం.. చంచల్ గూడా జైలు నుంచి విడుదల కావటం జరిగింది.
సాయం చేస్తామని.. అండగా నిలుస్తామని చెప్పిన కేసీఆర్ అండ్ కోకు భిన్నంగా.. రేవంత్ మాత్రం వారికి బెయిల్ రావటంలో కీలక భూమిక పోషించినట్లుగా చెబుతున్నారు. ఎవరికి పట్టని వేళ.. తమను రేవంత్ ఆదుకున్నారని బెయిల్ మీద బయటకు వచ్చిన వారు పేర్కొనటం గమనార్హం.