మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చారు. కాపునాడు సభ విశాఖలో నిర్వహిస్తున్న విషయాన్ని చెప్పారు. వంగవీటి మోహనరంగా వర్ధంతి డిసెంబర్ 26న సందర్భంగా విశాఖలో గ్రాండ్ గా కాపునాడుని నిర్వహిస్తున్నామని తెలియచేశారు. ఎపుడూ విజయవాడలో ఆ రోజున కార్యక్రమాలు సాగుతాయని, కానీ ఈసారి విశాఖలో కూడా చేస్తున్నామని వివరించారు.
రంగా అందరివాడు, ఆయన బడుగు బలహీన వర్గాలకు ప్రతినిధి అని గంటా కొనియాడారు. ఈ సందర్భంగా గంటా తాను పార్టీ మారడంలేదు అని కూడా క్లారిటీ ఇచ్చారు. అదే టైం లో ఏపీలో రెండు పార్టీలే ఉన్నాయా అంటూ వైసీపీ టీడీపీలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అంటే గంటా ఆలోచనలు ఏంటి అన్న చర్చ కూడా వచ్చింది. అయితే గంటా కాపునాడు సభకు అందరూ హాజరవుతారని అంటున్నారు.
పార్టీలకు అతీతంగా ఈ సభను కాపునాడు నిర్వహాకులు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇందులో రాజకీయాలు లేవని అంటున్నా కాపునాడు పోస్టర్ మీద ఒక వైపు గంటా మరో వైపు చిరంజీవి బొమ్మ ఉండడంతో విశాఖ కాపునాడు ద్వారా రాజకీయ సంచలనాలు ఏమైనా ఉంటాయా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఇక చూస్తే విశాఖ కాపునాడు మీటింగ్ కి చిరంజీవి వస్తారా అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. ఆయన వచ్చినా రావచ్చు అంటున్నారు. పోస్టర్ మీద ఆయన ఫోటో ఉంది ఆయన అనుమతితోనే అలా పెట్టి ఉంటారు కాబట్టి కచ్చితంగా ఆయన వస్తారని అంటున్నారు.
ఈ సభకు అన్ని పార్టీలకు చెందిన కాపులు హాజరవుతారు అని చెబుతున్నా గంటా చేత పోస్టర్ ఆవిష్కరించడం, ఆయన ప్రస్తుతానికి తెలుగుదేశంలో ఉండడంతో వైసీపీకి చెందిన వారు వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయన్న ప్రశ్నలు ఉన్నాయి. ఇక కాపునాడు సభలో కాపులకు రాజ్యాధికారం లభించాలన్న డిమాండ్ ఉంటుంది అని అంటున్నారు.
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అన్నీ కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. దాంతో ఈ సభ ఇపుడు కాకపోతే మరెప్పుడు అంటూ కాపులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెర మీదకు తెస్తుందా అన్నది చూడాలని అంటున్నారు. ఇక ఈ సభ వెనక ఎవరు ఉన్నారు అన్నది కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. గంటా టీడీపీలో ఉన్నా ఆయన కాపునాడు ద్వారా తన రాజకీయానికి పదును పెడుతున్నారా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.
కాపులకు రాజ్యాధికారం అంటూ కాపునాడు సభలో డిమాండ్ చేస్తే మాత్రం టీడీపీకి వైసీపీలకు ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు. అదే సమయంలో జనసేనకు ఈ డిమాండ్ అనుకూలం అవుతుంది అని చెబుతున్నారు. ఇక బీజేపీ సైతం కాపులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించే అవకాశాలు కూడా భవిష్యత్తులో ఉంటాయి. కానీ వైసీపీ టీడీపీలలో అలా కాదు, చంద్రబాబు, జగన్ అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్ధులుగా ఉన్నారు.
దాంతో ఈ సభ నిర్వహణ ద్వారా పవన్ కళ్యాణ్ణి జనసేనకు మరింత బలోపేతం చేస్తారా అన్న మాట కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా గంటా చాలా కాలం మౌనంగా ఉండి ఇపుడు గేర్ మార్చారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయం అంతా కాపుల చుట్టూ తిరుగుతుంది కాబట్టే ఈ కార్డుతో గంటా తనదైన కొత్త పాలిటిక్స్ ని చూపిస్తారు అని అంటున్నారు. మొత్తానికి గంటా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అన్నదే కీలకమైన ప్రశ్న. జవాబు ఈ నెల 26న తెలుస్తుంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.