మాజీ మంత్రి, ఉమ్మడి విశాఖ జిల్లా బిగ్ షాట్ గంటా శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటేది సరైన చోటేది అన్న ప్రశ్నలు ఇపుడు వస్తున్నాయి. గంటా నాలుగేళ్ల పాటు తన రూటే సెపరేట్ అన్నట్లుగా ఉన్నారని సొంత పార్టీలోనే అంటున్నారు. ఇపుడు ఆయన భావి నాయకుడు నారా లోకేష్ తో భేటీ అవడం ద్వారా చురుకుగానే వ్యవహరించారు.
పార్టీతో ఏర్పడిన గ్యాప్ ని ఆయన తగ్గించుకుంటున్నారు. అదే టైం లో లోకేష్ నాయకత్వానికి జై కొడుతున్నారు. అంతా ఓకే కానీ తెలుగుదేశం పార్టీ గంటాను ఈ దశలో మళ్ళీ చేరదీస్తుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సొంత పార్టీలో గంటా అంటే గిట్టని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన ఆ మధ్యనే పార్టీలో కొన్ని బురద పాములు ఉన్నాయని ఇండైరెక్ట్ గా గంటా మీద సెటైర్లు వేశారని ప్రచారం జరిగింది.
వాటిని దగ్గరకు చేరనీయవద్దు అని ఆయన హై కమాండ్ కి సూచించారు కూడా. మరి గంటా నేరుగా లోకేష్ తో భేటీ కావడం ద్వారా సమస్య ఎక్కడ ఉందో అక్కడ నుంచే పరిష్కరించుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీతో జనసేనకు పొత్తులు కుదిరితే కీలకమైన నియోజకవర్గాలు అన్నీ ఆ పార్టీకే వెళ్తాయని చెబుతున్నారు. అందులో గంటా కోరేవి, పోటీ చేయాలనుకునే నియోజకవర్గాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
ప్రస్తుతం గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ సీటును కూడా జనసేన కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. అలాగే గంటా ఎంతో ఇష్టపడే భీమునుపట్నం, గాజువాక, చోడవరం, అనకాపల్లి, ఎలమంచిలి కూడా జనసేన పొత్తులో భాగనగా కోరినట్లుగా చెబుతున్నారు. మరి ఈ సీట్లు కనుక జనసేనకు ఇస్తే గంటా ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు.
గంటా వచ్చే ఎన్నికల్లో చోడవరం నుంచి కానీ భీమిలీ నుంచి కానీ పోటీ చేయలానుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కానీ ఇపుడు చూస్తే ఈ సీట్లు జనసేన కోరితే ఇవ్వకతప్పదని అంటున్నారు. ఈ సీట్లలో ఆ పార్టీ కూడా బలంగా ఉంది. పైగా గట్టి అభ్యర్ధులు జనసేనకు ఉన్నారని అంటున్నారు.
దాంతో పాటు గంటాకు గత ఎన్నికల్లోనే కోరుకున్న భీమిలీ సీటుని ఇవ్వలేదు అన్న బాధ ఉంది. దాంతోనే ఆయన గెలిచిన తరువాత పార్టీకి ఎడం పాటించారు అని అంటారు. ఒక దశలో వేరే పార్టీలోకి వెళ్లాలని చూశారని అంటారు. కానీ ఇపుడు చూస్తే గంటా తెలుగ్దుదేశంలో కొనసాగితే మాత్రం విశాఖ జిల్లాలో ఆయనకు పోటీ చేసేందుకు సీటు లేదని చెప్పాలి.
ఇక విశాఖ తూర్పు, పశ్చిమలలో పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సౌత్ లో క్యాండిడేట్ ని కన్ ఫర్మ్ చేశారు. పెందుర్తిలో చూస్తే మాజీ మంత్రి బండారు సత్యనారాణమూర్తి బెర్త్ కన్ ఫర్మ్ చేసుకున్నారు. అదే విధంగా రూరల్ లో చూస్తే నర్శీపట్నంలో అయ్యన్నపాత్రుడు పోటీ చేస్తారు. మాడుగులలో లోకల్ లీడర్స్ ఉన్నారు. మరి గంటాకు పోటీ చేయడానికి ఎమ్మెల్యే సీటు లేదా అంటే జనసేనతో పొత్తులో సీట్లు ఏమైనా మిగిలితేనే చూడాలని అంటున్నారు. ఇక విశాఖ ఎంపీ సీటు కూడా జనసేన అడిగినట్లుగా తెలుస్తోంది. మరి ఈసారి విశాఖ నుంచి గంటా పోటీ చేస్తారా లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.