కేసీయార్ లో లెఫ్టిస్ట్ ఉన్నాదు. అదే టైమ్ లో రైటిస్టూ ఉన్నాడు. నన్ను మించిన హిందూత్వ వాది ఎవరైనా ఉన్నారా అని జబ్బలు చరచి సవాల్ చేయడం ఆయనకే చెల్లు. నిజంగా కేసీయార్ చేసినన్ని యాగాలు హోమాలు ఏ రాజకీయ నాయకుడూ చేయలేదు. హిందూత్వ అంటూ నిత్యం నినదించే బీజేపీ వారు కూడా చాలా మంది ఈ విషయంలో ఆయనతో పోటీ పడలేరు.
యాదాద్రిని అద్భుతంగా నిర్మించి అధ్యాత్మికవాదిగా చాటుకున్న కేసీయార్ బీజేపీకి ఉన్న హిందూత్వ కార్డుని తన వైపు తిప్పుకోవాలని చూశారు. అయితే ఆయనకు మజ్లీస్ దోస్తీ ఎప్పటికపుడు ఇలాంటివి పక్కకు పోయేలా చేస్తోంది. బీజేపీ కూడా దాన్నే టార్గెట్ చేస్తోంది. ఇక మోడీని, బీజేపీని విమర్శించడంతో లెఫ్ట్ పార్టీల కంటే కూదా దూకుడు చేస్తారు కేసీయార్.
అలా వారి కంటికి ఆయన అపర కమ్యూనిస్టుగా ఉంటారు. ఇంతకీ కేసీయార్ ఫిలాసఫీ ఏంటి అంటే ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు అని చెప్పాలేమో. ఇక వామపక్షాలను మిత్రులుగా చేసుకుని మజ్లీస్ తో చెట్టాపట్టాల్ వేస్తూ దేశంలో బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని తెలంగాణాలో కూడా నింపి సొమ్ము చేసుకుందామని కేసీయార్ చూస్తున్నారు.
ఆ ఎత్తుగడ అలా ఉండగానే మళ్లె ఏమైందో ఏమో ఇపుడు మహా యాగం అంటున్నారు. హిందూత్వ వైపుగా కేసీయార్ మరోసారి మళ్ళుతున్నారనడానికి ఈ యాగమే ఉదాహరణ అంటున్న వాళ్ళూ ఉన్నారు. కేసీయార్ ఇప్పటికి చాలా సార్లు యాగాలు చేశారు. తెలంగాణా రావాలని అప్పట్లో చేశారు. 2014 ఎన్నికల ముందు అలాగే 2018 లో మరోసారి యాగాలను చేశారు. ఈ యాగాల ఫలాలు కూడా ఆయన అందుకున్నారు. తెలంగాణా వచ్చింది. రెండు సార్లు సీఎం కూడా అయ్యారు.
ఇక చూసుకుంటే మరోసారి మహా యాగం అని కేసీయార్ అంటున్నరు. మునుగోడు ఉప ఎన్నికల తరువాత భారీ ఎత్తున యాగాన్ని నిర్వహించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏడాది వ్యవధిలో ఎన్నికలు ఉన్నాయి. ఈసారి కూడా టీయారెస్ అధికారంలోకి రావాలని కేసీయార్ బలంగా కోరుకుంటున్నారు.
మరి ఆయన చేస్తున్న యాగం దేని కోసం అన్న చర్చ ఉన్నా గతంలో జరిగినవి విషయాలు చూసుకుంటే మళ్లీ విజయం కోసమే అని అంటున్నారు. మరి కేసీయార్ కి హ్యాట్రిక్ కొడతారా. హిందూత్వను హిందూత్వతోనే ఢీ కొట్టాలి అని కేసీయార్ భావిస్తూ మహా యాగాన్ని తలపెడుతున్నారా అన్నదే ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.