తెలుగుదేశం పార్టీలో ఉంటూ అధికారం అనుభవించిన వారే వైసీపీకి కావాల్సి వస్తున్నారా, వారే ముద్దుగా ఉంటున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అదే నిజమని చెబుతున్నాయి. అయిదేళ్ల తెలుగుదేశం ఏలుబడిలో అన్ని రకాలుగా లబ్ది పొందిన వారు వైసీపీలో చేరి తమ హవా చాటుకుంటున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికి వస్తే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు టీడీపీ ఏలుబడిలో అయిదేళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. ఆయన చివరి నిముషంలో టీడీపీ నుంచి బయటకు వచ్చేసి వైసీపీలో చేరారు. ఎన్నికల అనంతరం మంత్రిగా కూడా అయిపోయారు. అలా తన జీవిత కాల కోరికను ఆయన తీర్చుకున్నారు.
ఇక టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేసి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసిన పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరిపోయారు. ఆయన రెండేళ్ళుగా అధికార పార్టీలోనే ఉంటున్నారు. తాజాగా ఆయన తాడేపల్లి వెళ్ళి జగన్ని ఆయన నివాసంలో కలసి చర్చలు జరిపారు. తొందరలోనే ఆయనకు కీలకమైన పదవి కానీ బాధ్యతలు కానీ అప్పగిస్తారు అన్న ప్రచారం సాగుతోంది. ఇక వచ్చే ఎన్నికల్లో పంచకర్లకు టికెట్ కూడా దక్కుతుందన్న ప్రచారమూ ఉంది.
అయితే పంచకర్ల విశాఖ ఉత్తరం సీటు అడుగుతున్నారని టాక్. కానీ జగన్ మాత్రం ఆయన్ని అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి నుంచి మరో మారు పోటీ చేయించాలని చూస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో క్లారిటీ వస్తే ఈ మాజీ తమ్ముడు వైసీపీకి బహు ఇష్టుడిగానే అయిపోతారని చెబుతున్నారు.
ఇక బడా కాంట్రాక్టర్ గా ఉంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెంట ఉండే కాశీ విశ్వనాధ్ అనే మరోకాయన గత ఏడాది జీవీఎంసీ ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆయన విశాఖ పశ్చిమ సీటుని ఆశిస్తున్నారు. అయితే అక్కడ ఆడారి కుటుంబం నుంచి ఆడారి ఆనంద్ కి తెచ్చి ఇంచార్జిగా ఈ మధ్యనే వైసీపీ నియమించింది. దాంతో ఆయనకు ఏదైనా కీలక పదవి ఇచ్చి వచ్చే ఎన్నికలకు వాడుకుంటారని చెబుతున్నారు. లేకపోతే అనకాపల్లి ఎంపీ టికెట్ అయినా కాశీకి ఇచ్చే ఆలోచన ఉందని అంటున్నారు. ఈయన కూడా తాజాగా జగన్ని కలసి హామీ తీసుకుని వచ్చారని చెబుతున్నారు.
ఇక రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి విశాఖ సిటీ టీడీపీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో రెండేళ్ల క్రితం జంప్ చేశారు. దాంతో పార్టీలో పాతవారిని పక్కన పెట్టేసి ఆయనకే నియోజకవర్గం ఇంచార్జి పదవి ఇచ్చారు. ఇపుడు ఆయనకు మరో భరోసా కూడా దక్కింది. వచ్చే ఎన్నికల్లో ఆయననే విశాఖ సౌత్ నుంచి వైసీపీ టికెట్ మీద పోటీ చేయించడానికి హామీ దొరికింది అని అంటున్నారు.
అదే విధంగా మరో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ రహమాన్ కి కూడా పార్టీ భరోసా ఇచ్చింది. ఆయన కూడా చిరకాలం టీడీపీలో ఉండి వచ్చినవారే. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి టికెట్ కోరుతున్నారు. అయితే ఎక్కడా అకామిడేట్ చేయలేకపోతే ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని పార్టీ చూస్తోంది. ఇదే విధంగా మరో మాజీ ఎమ్మెల్యే టీడీపీ మాజీ తమ్ముడు తిప్పల గురుమూర్తిరెడ్డిని గాజువాక నుంచి పోటీకి పెడతారు అని టాక్ నడుస్తోంది.
మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మొదటి నుంచి వైసీపీలో ఉన్న వారి సంగతేంటి అన్న చర్చ వస్తోంది. గెలుపు గుర్రాలు అని పక్క పార్టీ వారికి టికెట్లు ఇస్తూ పోతే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారి విషయం ఏమిటీ అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చూస్తే పొరుగింటి పుల్ల కూర రుచి న్నట్లుగా మాజీ తమ్ముళ్ళే వైసీపీకి ముద్దు అవుతున్నారు అని అంటున్నారు.