ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదివి కాలం నేటితో ముగియబోతుంది. ఇదే ఆయనకి చివరి పని దినం. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పదవిలో ఉన్నంత కాలం తీసుకున్న నిర్ణయాలు, ఉద్యోగుల సహకారం, ప్రభుత్వ సహకారం, మీడియా సహకారం పై సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నేనున్న ఈ సమయంలో మీడియా సహకారం మరువలేనిది. అలాగే రాష్ట్రంలోని అన్ని ఎన్నికలు సజావుగా జరిగాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు రీ పోలింగ్ లేకుండా జరగడం అభినందనీయం. ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతోనే ఇది సాధ్యం అయ్యింది. కలెక్టర్లు, ఎస్పీలు మంచి పనితీరు కనబరిచారు. ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం లభించింది. సీఎస్, డీజీపీకి నా కృతజ్ఞతలు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల సమయంలో ఎన్నికల సిబ్బంది కొందరు సెలవులో వెళ్ళాలని అనుకున్నారు. వారితో మాట్లాడి ఆ సమస్యను తొలగించాం. పంచాయతీ ఎన్నికల సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఎన్నికల కమిషన్ గా మీకున్న అధికారాలతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. ఎన్నికల కమిషన్ పరిధి దాటి వ్యవహరించలేదు. చట్ట సభల్ని గౌరవించాల్సిందే.. గవర్నర్ సెక్రటరీగా పని చేసినపుడు, నాకు వ్యవస్థలపై పూర్తి అవగాహన ఉంది. ఎన్నికల సంఘం నూతన కార్యదర్శిగా నీలం సాహ్ని నియామకాన్ని స్వాగతిస్తున్నాను. వారికి అభినందనలు తెలిపారు. నేను ఏ లేఖలు రాసినా బహిర్గతం చేయలేదు. అధికారిక విషయాలు బయటకు వెల్లడించను. హైకోర్టులో అనేక విషయాల్లో ఎన్నికల కమిషన్ విజయం సాధించింది. 243 అధికరణం ప్రకారం ఎన్నికల కమిషన్‌కు అధికారాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం నుంచి కోరుకున్న విధంగా తోడ్పాటు, సహకారం లభించింది అని తెలిపారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా నిబంధనలు ఉన్నాయి. అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకొని ఎన్నికల సంస్కరణలపై ఒక నివేదిక తయారు చేసాను. త్వరలో గవర్నర్ కి అందిస్తాను అని తెలిపారు. అలాగే నా ఓటు స్వగ్రామంలో లేదు.. దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు. పదవీ విరమణ తరవాత నా హక్కుల సాధన కోసం న్యాయ పోరాటం చేస్తాను అని తెలిపారు.