తెలుగోళ్లతో పెట్టుకున్నోడు ఎవరూ బాగుపడిన దాఖలాలు లేవన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్లే ప్రధాని మోడీ తాజా పరిస్థితి ఉందని చెప్పక తప్పదు. తెలుగోళ్లను బొమ్మాట ఆడుకుంటున్న మోడీ ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయిన పరిస్థితి. నీతులు చెప్పిన నోళ్లు మూతపడటమే కాదు.. మాటల కోసం వెతుక్కునే పరిస్థితుల్లో ఇప్పుడు మోడీ అండ్ కో పడింది.
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో మోడీ అడ్డంగా బుక్ అయినట్లుగా దేశ ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితి. మొన్నటి వరకూ నీతి..నిజాయితీగా పాలించిన ప్రభుత్వాల్లో మోడీ సర్కారు ఒకటన్న పేరుప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న మోడీ మాష్టారికి.. ఇప్పుడు ఆ మాటను మాట వరసకు కూడా అనలేని పరిస్థితి నెలకొంది. దాదాపు 50వేల కోట్ల అవినీతి చోటు చేసుకున్నట్లుగా వినిపిస్తోన్న రాఫెల్ వ్యవహారం పుణ్యమా అని.. బయటకు వచ్చిన రాఫెల్ ఇలా ఉంటే.. బయటకు రావాల్సిన మరిన్ని కుంభకోణాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
రాఫెల్ కు.. తెలుగోళ్లకు లింకు ఏమిటన్నది మీ ప్రశ్నా? అక్కడికే వస్తున్నాం. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో తెలుగింటి ఆడపడుచు నిర్మలా సీతారామన్ కీలకమన్న సంగతి తెలిసిందే. కేంద్ర రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్న ఆమె.. ఈ ఒప్పందంలో మోడీతో పాటు కీలకమని చెప్పక తప్పదు. రాఫెల్ ఒప్పందంపై ధైర్యం చేసి నోరు విప్పి మాట్లాడుతున్న ఏకైక బీజేపీ నేతగా చెప్పాలి.
రాఫెల్ డీల్ లోని లోపాలు బయటకు రావటానికి తెలుగుప్రాంతానికి చెందిన నిర్మలా సీతారామన్ కూడా కారణమని చెప్పాలి. పలు సందర్భాల్లో ఆమె మాట్లాడిన మాటల్లోని అంతరాలే.. ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలకు అస్కారం ఇవ్వటంతో పాటు.. ఈ విషయాన్ని అక్కడితో వదలకూడదన్న భావన కలిగేలా చేశాయని చెప్పాలి. తెలుగు వారికి ఇవ్వాల్సిన హోదా ఎపిసోడ్ లో అడ్డగోలు వాదనకు దిగి.. తిరుపతి వెంకన్న సాక్షిగా తాను మాట ఇచ్చానన్న విషయాన్ని వదిలేసిన మోడీకి.. స్వామివారి సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టబడని వైనం ఆయనకు శాపంగా మారిందన్న మాటను చెబుతున్న వారు లేకపోలేదు. ఓవైపు శ్రీవారి ఆగ్రహం.. మరోవైపు తెలుగింటి కోడలు నిర్మల కీలక భూమిక వహిస్తున్న రక్షణ శాఖకు సంబంధించిన అంశం ప్రధాని మోడీని ఉక్కిరిబిక్కిరి చేసేలా చేయటమే కాదు.. పూర్తిగా ఆత్మరక్షణలో పడేసిందని చెప్పక తప్పదు. మోడీ ఎదుగుదలలో తెలుగువారి పాత్ర ఉన్నా లేకున్నా.. ఆయన డౌన్ ఫాల్ లో మాత్రం తెలుగు వారి పాత్ర ఉందని చెప్పక తప్పదన్న మాట బలంగా వినిపిస్తోంది.