డీల్ స‌రే.. మేకిన్ గొప్ప‌లెందుకు నిర్మ‌లా

Update: 2018-10-02 06:24 GMT
కొన్నిసార్లు అంతే. కాల‌మ‌హిమో.. చెప్పే మాట‌ల్లో బ‌లం లేక‌పోవ‌టమేమో కానీ ఎంత వాగ్ధాటి ఉన్నా వ‌ర్క్ అవుట్ కాదు. బీజేపీలో చ‌క్క‌టి వాద‌నా ప‌టిమ ప్ర‌ద‌ర్శించి..రాజ‌కీయ‌ ప్ర‌త్య‌ర్థుల్ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసే స‌త్తా ఉన్న నేత‌గా పేరు తెచ్చుకోవ‌ట‌మే కాదు.. ఏకంగా కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి స్థాయికి ఎదిగారు.

అలాంటి నిర్మ‌ల‌మ్మ ఇప్పుడు అదే ప‌నిగా అడ్డంగా బుక్ అవుతున్నారు. ఒక‌ప్ప‌టి ఆమె ఆయుధాలుగా ఉన్న ఆమె మాట‌లే ఇప్పుడామెకు కొత్త తిప్ప‌లు తెచ్చి పెడుతున్నాయి. రాఫెల్ డీల్ సంగ‌తేమో కానీ.. ఆ డీల్ పుణ్య‌మా అని మోడీ ఇమేజ్ ఎంత‌లా డ్యామేజ్ కావాలో అంత‌లా డ్యామేజ్ అయ్యింది. దీనికి తోడు స‌ద‌రు డీల్ విష‌యంలో వెల్లువెత్తుతున్న ఆరోప‌ణ‌ల‌కు ధీటుగా స‌మాధానం చెప్పాల్సిన బీజేపీ మాట‌ల కోసం వెతుక్కునే ప‌రిస్థితి. అంద‌రూ వేలెత్తి చూపిస్తున్న మోడీ సైతం మౌనంగా ఉండ‌టం ఇప్పుడు కొత్త సందేహాల‌కు తావిచ్చేలా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ఏదో చెప్పాల‌న్న‌ట్లుగా చెప్ప‌ట‌మే కానీ.. ప్ర‌తిప‌క్షాలు ఏ అంశాల్ని సూటిగా ప్ర‌శ్నిస్తున్నాయో.. వాటి మీద మాత్రం మోడీ క్లారిటీ ఇవ్వ‌ని ప‌రిస్థితి.

ఇలాంటి వేళ‌.. చెన్నైలో నోరు విప్పిన నిర్మ‌లా.. డీల్ లో ఏదో మ‌త‌ల‌బు ఉంద‌న్న‌ట్లుగా మాట్లాడ‌టం సంచ‌ల‌నంగా మారింది. అయితే.. అదంతా ఫ్రాన్స్ మాజీ అధ్య‌క్షుడి మీద ఆరోప‌ణ‌లు చేసిన‌ప్ప‌టికీ.. జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రోసారి రాఫెల్ డీల్ మీద క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన నిర్మ‌లా మ‌రోసారి బుక్ అయ్యారంటున్నారు.

రాఫెల్ డీల్ లో కాంగ్రెస్ కంటే తాము ఒక మెట్టు ఎక్కువ‌గానే ఉన్నామ‌ని.. 126 విమానాలు కాకుండా 36 విమానాల్ని మాత్ర‌మే ఎందుకు కొంటున్నార‌ని కాంగ్రెస్ అదే ప‌నిగా ప్ర‌శ్నిస్తోంద‌న్న ఆమె.. దానికి స‌మాధానం చెప్పే క్ర‌మంలో ప్ర‌త్య‌ర్థుల‌కు చ‌క్క‌టి అవ‌కాశం ఇచ్చేశారు. కాంగ్రెస్ వారి డీల్ ప్ర‌కారం కొనుగోలు చేసిన వెంట‌నే ఉప‌యోగించుకోవ‌టానికి వీలుగా ఉండే విమానాలు కేవ‌లం 18 మాత్ర‌మేన‌ని.. తాము మాత్రం 36 చేసుకున్నామ‌న్నారు. కాంగ్రెస్ వారి డీల్ ప్ర‌కారం అయితే.. రెడీమేడ్ గా ఉన్న‌వి 18 అయితే.. మిగిలిన 108 విమానాల్నిభార‌త్ లో త‌యారు చేయాల్సి ఉంటుంద‌ని.. అదెప్ప‌టికి పూర్తి అయ్యే ప‌ని అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ లోపాన్ని ఎత్తి చూపే క్ర‌మంలో త‌మ‌ను వేలెత్తి చూపించే అంశాన్ని నిర్మ‌ల మ‌ర్చిపోయిన‌ట్లున్నారు. మోడీ మాన‌స పుత్రిక అయిన మేకిన్ ఇండియాను కాంగ్రెస్ చేస్తే.. మోడీ స‌ర్కారు మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. కోట్లు ప‌డేసి రెడీమేడ్ గా కొనేసే ప‌నే అయితే.. మేకిన్ ఇండియా అంటూ బ‌డాయి మాట‌లు ఎందుకు? అన్న ప్ర‌శ్న‌కు నిర్మ‌ల తాజా వ్యాఖ్య‌లు కార‌ణంగా మార‌టంపై బీజేపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. చూస్తుంటే.. రాఫెల్ డీల్ బీజేపీ నేత‌ల‌కు ఏ మాత్రం క‌లిసి వ‌చ్చిన‌ట్లుగా లేన‌ట్లుందే?


Tags:    

Similar News