నిత్యానంద‌కు.. కేఏ పాల్‌కు తేడా లేదా!

Update: 2022-05-15 06:18 GMT
అదేంటి అనుకుంటున్నారా? ఇద్ద‌రికీ లింకు ఎలా కుదురుతుంద‌ని బుగ్గ‌లు నొక్కుకుంటున్నారా? అక్క‌డి కే వ‌ద్దాం. హిందూ వ‌ర్గానికి చెందిన వివాదాస్ప‌ద గురువు నిత్యానంద‌. ఇక‌, ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ ఆర్గ‌నైజేష న్ ఏర్పాటు చేసుకుని... ప్ర‌పంచానికి శాంతి పేరిట సందేశం ఇచ్చే కేఏ పాల్‌. ఇద్ద‌రూ కూడా దొందూ దొం దే! ఎలాగంటే.. ఇద్ద‌రూ కూడా ఎవ‌రికి వారు.. హైప‌ర్‌గా ఊహించుకుంటారు. నేనే గొప్ప‌! అనే ఫీలింగ్ అం ద‌రిలోనూ ఉన్న‌ట్టే వీరిలో ఉన్న‌ప్ప‌టికీ.. వీరిలో మిగిలిన‌వారిక‌న్నా..  నూటికి 1000 ప‌ర్సంట్ ఎక్కువ‌గా ఉంద‌న్న మాట‌.

దీంతో వీరికంటూ.. ఒక భాష ఉంటుంది?  వీరి న‌డ‌క‌, న‌డ‌త‌.. అంతా కూడా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అంద రిలోనూ ఉంటారు. కానీ, అందరిక‌న్నా.. భిన్నంగా ఆలోచ‌న‌లు ఉంటాయి. త‌మ‌కు తామే దేవుళ్లుగా.. దేవ దూత‌లుగా భావిస్తారు. దీంతో అటు నిత్యానంద‌కు .. ఇటు పాల్‌కు మ‌ధ్య అనేక సారూప్య‌త‌లు ఉన్నాయ‌ని అంటారు ప‌రిశీల‌కులు. ఇద్ద‌రూ కూడా.. మీడియాకు రేటింగులు పెంచేస్తారు.. వారు ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా.. ప్రేక్ష‌ల‌కు క‌నువిందు... మీడియాకు రేటింగుల విందు అన్న‌ట్టుగా ఉంటుంది ప‌రిస్థితి.

నిత్యానంద ప‌రిస్థితి ఇదీ..

క‌ర్ణాట‌క‌కు చెందిన నిత్యానంద‌.. సినీ తార‌ల నుంచి అనేక మందితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నార నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఈ కేసుల్లోనే స్వామీజీ 50 సార్లు కోర్టుకు హాజరై.. 2019 నవంబర్లో భారత్ వదిలి పారిపోయారు. 'కైలాస' అనేది నిత్యానంద ఏర్పాటు చేసుకున్న కొత్త‌ ప్రపంచం. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసను ప్ర‌త్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా చేసుకున్నారు. కొద్దిరోజులకు కైలాస డాలర్‌ను కూడా తీసుకొచ్చారు.

తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు. అయితే, ఆయన ఎక్కడ ఉంటున్నారనే విషయం మాత్రం తెలియదు. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఆయన నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈక్వెడార్‌ మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది. అంటే సాధార‌ణ ప్ర‌పంచానికి .. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు భిన్నంగా ఒక కొత్త ప్ర‌పంచాన్ని ఏర్పాటు చేసుకుని.. విభిన్న మ‌న‌స్త‌త్వంతో ఉండే నిత్యానంద స్ట‌యిలే వేరు.

పాల్ గురించి ఇదీ..

నిత్యానంద ఆధ్యాత్మికంగా త‌న‌ను తాను ఎలా అయితే.. ప్ర‌భువుగా ప్ర‌క‌టించుకున్నారో.. పాల్ కూడా అం తే. అయితే.. ఈయ‌న కొంత శాంతి అంటూ..మ‌రికొంత రాజ‌కీయం అంటూ.. క‌ల‌గాపుల‌గం చేసేసి.. మొత్తా నికి త‌నే సూప‌ర్ నేత‌గా ప్ర‌క‌టించుకుంటారు. ప్రపంచానికి పాఠాలు నేర్పించాన‌ని చెప్పుకొంటారు. అంతే కాదు.. భార‌త్‌లో ఏర్ప‌డేది త‌న ప్ర‌భుత్వ‌మేన‌ని.. కుద‌ర‌క‌పోతే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉంటామ‌ని.. పాల్ చెప్పుకొంటారు. అంతేకాదు... తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తామంటారు.. ఏపీలో జ‌గ‌న్‌ను దింపేస్తామ‌ని చెబుతారు. కానీ, తీరా వెన‌క్కి చూసుకుంటే.. గాలి పోయిన‌.. బూర లాంటి ప‌రిస్థితే క‌నిపిస్తుంది!! 
Tags:    

Similar News