బ్యాలెట్ పేప‌రు ఎంత భారీగా ఉంటుందంటే..

Update: 2019-03-29 12:28 GMT
రైతుబంధుతో మాది రైతు ప్ర‌భుత్వం అయ్యింద‌ని కేసీఆర్ చెబుతున్నారు. కానీ దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వంపై రైతులు వ్య‌క్తంచేయ‌నంత కోపాన్ని తెలంగాణ రైతులు కేసీఆర్‌పై చూపారు. రైతుల‌ను బిచ్చ‌గాళ్లుగా చూస్తున్నారు...నాలుగు రూపాయ‌లిచ్చి దేవుళ్ల‌వుతారా? అస‌లు స‌మ‌స్య‌ను పక్క‌దారి ప‌ట్టిస్తారా? ఎంత‌కాలం విన్న‌వించినా ప‌ట్టించుకోరా అంటూ ప‌సుపు.. ఎర్ర‌జొన్న రైతులు కేసీఆర్ త‌గిలించుకోవాల‌నుకున్న *రైతుబంధ‌వు* బిరుదును అడ్డుకున్నారు.

ఏక‌ప‌క్షం అవుతున్న తెలంగాణ ఎన్నిక‌ల్లో అస‌లైన మ‌జా తెచ్చారు ఈ రైతులు.  ఎంత‌కీ త‌మ స‌మస్య‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో విసుగుచెందిన ఎర్ర జొన్న‌ - ప‌సుపు రైతులు నిజామాబాద్‌లో కేసీఆర్ కూతురు క‌విత‌పై పోటీకి దిగి నిర‌స‌న తెలిపారు. వారి ప్ర‌తాపానికి ఇక్క‌డ ఈవీఎం వాడే అవ‌కాశ‌మే లేకుండా పోయింది. ఇక్క‌డ క‌విత మీద ఏకంగా 185 మంది ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌గా వీరిలో 175 మంది దాదాపు రైతులే. మా స‌మ‌స్య‌లు చెబితే ప‌ట్టించుకోరా... మీ ప‌రువు తీస్తాం అంటూ బ్యాలెట్కు ఎక్కారు రైతులు. అయితే, ప్ర‌స్తుత అవ‌కాశాల ప్ర‌కారం... ఇంత‌మంది అభ్య‌ర్థులు ఉన్న‌చోట ఈవీఎంలు వాడే అవ‌కాశం లేదు. అందుకే బ్యాలెట్ పేప‌రు ప‌ద్ధ‌తిలో ఎన్నిక‌లు జ‌రపాల‌ని ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీని కార‌ణంగా మొత్తం పోలింగ్ వ్య‌వ‌హార‌మే మారిపోయింది. బ‌హుశా ఈ ఎన్నిక మొద‌టి ఫేజ్‌లో జ‌రుగుతుందో లేదో అన్న అనుమానం కూడా ఉంది.

185 మంది అభ్య‌ర్థులు వారి గుర్తులు ముద్రించాల్సి రావ‌డంతో చ‌రిత్ర‌లోనే అతిపెద్ద బ్యాలెట్ పేప‌రుగా ఇది నిల‌వ‌నుంది. ఆ లెక్క‌న ఆల్ఫాబెటిక‌ల్ ఆర్డ‌రు ప్ర‌కారం పేర్లు వ‌స్తే... క‌విత పేరు ఎక్క‌డో మ‌ధ్య‌లో ఉంటుంది. ఆమె పేరు వెతికి ఓటు వేసే క్ర‌మంలో సామాన్యులు - ముఖ్యంగా నిర‌క్ష‌రాస్యులు క‌న్ఫ్యూజ్ అయ్యే ప్ర‌మాదం పుష్క‌లంగా ఉంది. 185 మంది ఉన్న‌పుడు కారును పోలిన గుర్తులు కూడా కొన్ని ఉండే అవ‌కాశం క‌చ్చితంగా ఉంది. దీనివ‌ల్ల ఆమెకు ప‌డే ఓట్లు చాలావ‌ర‌కు చీలే అవ‌కాశం లేక‌పోలేదు.
Tags:    

Similar News