కేసీఆర్ పై నిజాం మనవడి అసహనం

Update: 2017-11-29 06:03 GMT
ఔను.తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అత్యంత గౌర‌వించే నిజాం వార‌సులే గులాబీ ద‌ళ‌ప‌తి పై ఫైర్ అయ్యారు. త‌మ‌ను కేసీఆర్ అగౌర‌వ‌ప‌రిచాడంటూ ఆక్షేపించారు. ఏకంగా బ‌హిరంగ ప్ర‌క‌టన కూడా విడుద‌ల చేశారు. ఇదంతా అగ్ర‌రాజ్యాధిప‌తి డొనాల్డ్ ట్రంప్ త‌న‌య ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌రిగింది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్‌) లో భాగంగా సదస్సుకు హాజరైన విశిష్ట అతిథులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారత ప్రభుత్వం తరపున పసందైన విందు ఇచ్చారు. దేశ ప్రతిష్టను చాటే విధంగా ఈ విందులో నోరూరించే రకరకాల వంటకాలను అతిధులకు వడ్డించారు. అయితే ఈ విందుకు నిజాం కుటుంబ స‌భ్యుల‌కు ఆహ్వానం అంద‌లేద‌ట‌.

ఇటు కేంద్ర‌ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఇచ్చే విందుకు ఆహ్వానం అంద‌క‌పోవ‌డం...అటు రాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం ఇచ్చే విందుకు సైతం పిలుపు రాక‌పోవ‌డంతో...ఏడో నిజాం మనువడు నవాబ్ నజఫ్ అలీఖాన్ నారాజ్ అయిపోయి..త‌మ‌కు ప‌ట్టించుకోలేదంటూ..ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. త‌మ రాజ‌వంశ‌స్థీయులు చిహ్న‌మైన ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో విందు ఇస్తూ...త‌మ‌ను మాత్రం ఆహ్వానించ‌క‌పోవ‌డం ఏమిటంటూ క‌స్సుమ‌న్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిజాం కీర్తిస్తూ...త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఈ తీరు స‌రికాద‌ని అన్నారు. అత్యంత పటిష్ట భద్రత మధ్య డిన్నర్‌ జరిగింది. రాజభవనం ప్రధాన ద్వారం నుంచి ప్యాలెస్‌ వరకు అడుగడుగునా భద్రతను ఏర్పాటు చేశారు. అమెరికాకు చెందిన సీక్రెట్‌ సర్వీస్‌, భారత్‌కు చెందిన ఎస్పీజీ - ఎఫ్‌బీఐ నీడలో ప్రముఖులకు భద్రత అందించారు. మోడీ - ఇవాంకా వస్తున్నందున ఫలక్‌నుమా రాజ భవనాన్ని అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్‌ ధగధగల మధ్య రాజదర్పం ఉట్టిపడే విధంగా ప్యాలెస్‌ను అలంకరించారు. ప్యాలెస్‌లోకి ఇవాంకాను గుర్ర‌పు బ‌గ్గీలో తీసుకువెళ్లారు.

కాగా, అసలే రాజభవనం అందులో అమెరికా రాకుమారి ఇవాంకా , మోడీ రావడంతో ప్యాలెస్‌కు అంగరంగ వైభవంగా సొగసులద్దారు. లెవల్‌1 గా పిలువబడే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన డైనింగ్‌ టేబుల్‌పై ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షులు డోనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌ కూతురు, ఆ దేశ ప్రభుత్వ సలహాదారు ఇవాంకా మేరీ ట్రంప్‌తో పాటు రాష్ట్ర గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుతో పాటు ఇతర అతిధులు విందారగిం చారు. లెవల్‌ 2 లో మరో 2 వేల మందికి విందు ఇచ్చారు. లెవల్‌ 1 గా పిలవబడే డైనింగ్‌ టేబుల్‌ 108 అడుగుల పొడవుంది. ఈ టేబుల్‌ పైన 101 మంది అతిథులకు ఒకేసారి విందు ఏర్పాటు చేశారు. విందు కార్యక్రమం హాస్యోక్తులు, చలోక్తుల మధ్య సాగింది. షడ్రుచులతో అతిథులు ఖుషీగా మాట్లాడుకున్నారు. వావ్‌… అనే రీతిలో రుచులు ఉండడంతో ఇవాంకా ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు.
Tags:    

Similar News