ఎవ‌రితోనూ పొత్తు ఉండ‌దంటున్న మాజీ సీఎం

Update: 2016-12-28 13:36 GMT
డిల్లీకి ద‌గ్గ‌రి దారి అనే పేరున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో అనూహ్య వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకునే ఆలోచ‌న లేద‌ని స‌మాజ్‌ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాద‌వ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను ఇవాళ ఆయ‌న విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ములాయం 325 మంది అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించారు. మ‌రో 78 సీట్ల‌కు అభ్య‌ర్థుల పేర్ల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

తాజాగా వెలువ‌డిన జాబితా ప్ర‌కారం యూపీ సీఎంగా మ‌ళ్లీ అఖిలేశ్ పోటీప‌డ‌నున్నారు. అయితే ఆయ‌న ఏ స్థానం నుంచి పోటీ చేస్తార‌న్న విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. ములాయం సోద‌రుడు శివ్‌ పాల్ యాద‌వ్ మాత్రం జ‌స్వంత్ న‌గ‌ర్ నుంచి పోటీ చేయ‌నున్నారు. ప్ర‌ధాని మోదీ చేసిన పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యానికి త్వ‌ర‌లోనే స‌మాధానం దొరుకుతుంద‌ని, ఆ స‌మాధానం ప్ర‌జ‌లే ఇస్తార‌న్నారు. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 సీట్లు ఉన్నాయి. ఇవాళ జ‌రిగిన ప్రెస్‌ మీట్‌ కు అఖిలేశ్ హాజ‌రుకాలేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News