ఎవరు ఏం అనుకున్నా.. తెలుగుదేశం పార్టీ ఆమె ధాటిని ఎదుర్కొనలేక.. అసలు శాసనసభలో ప్రవేశించే అవకాశం లేకుండా చేసేసినా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా కీలకమైన నాయకురాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అసెంబ్లీ నుంచి ఆమెను బహిష్కరించినప్పటికీ.. ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక ధోరణుల గురించి - తీసుకునే నిర్ణయాల గురించి ప్రజల్లోంచే ఆమె నిత్యం ప్రశ్నిస్తూ చంద్రబాబు సర్కారుకు చెమట్లు పోయిస్తుంటారు. ఆయన మంత్రి వర్గంలోని వారిపై విమర్శలతో విరుచుకుపడుతుంటారు.
రోజా ఎప్పుడు విమర్శలతో విరుచుకుపడినా.. ఆమెకు దీటుగా స్పందించడానికి.. ఆమెకు రిటార్టులు ఇవ్వడానికి మరో మహిళా నాయకురాలిని వెతుక్కోవడం తెలుగుదేశం పార్టీకి తలకు మించిన భారంగా మారిపోతోంది. రోజా మాట్లాడినంత కన్ స్ట్రక్టివ్ గా సబ్జెక్టు మాట్లాడే మహిళా నాయకులు - అంత స్పష్టతతో సూటిగా మాట్లాడే మహిళా నాయకులు తెలుగుదేశానికి లేరు. మహిళా నాయకుల విషయంలో.. ఏదో మొక్కుబడిగా కోటా కోసం వచ్చిన నాయకులే తప్ప.. నిజమైన సొంత టేలెంట్ తో హోదాలు దక్కించుకున్న వారు తెదేపాలో లేరు. ఆ రకంగా రోజాను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో తెదేపా బలహీనంగా ఉన్నట్లే లెక్క.
పైగా రోజాకు ఉన్న సినీ గ్లామర్ ఒక అదనపు ఎడ్వాంటేజీ. ఆమె ఎంత సీరియస్ రాజకీయ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టినా.. ప్రజలు దాన్ని శ్రద్ధగా ఆలకించడానికి అదొక కారణం కావొచ్చు . అయితే ఇప్పుడు తెలుగుదేశం రోజాకు దీటు గానా అన్నట్లుగా.. వాణీవిశ్వనాధ్ ను తమ పార్టీలో చేర్చుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెదేపా పాలన ఈ మళయాళీ భామకు తెగ నచ్చిందిట. రోజా స్థాయిలో కాకపోయినా.. ఒకప్పట్లో హీరోయిన్ గానే చెలామణీ అయిన వాణీ విశ్వనాధ్.. కేవలం గ్లామర్ విషయంలో సినీ హీరోయిన్ గా పార్టీకి లాభిస్తుంది. అంతే తప్ప.. రోజాకు సమఉజ్జీ ఎలా అవుతుంది? అనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
రోజా రాజకీయ ప్రస్థానంలో చాలా కష్టపడి ప్రసంగనైపుణ్యం - విషయ పరిజ్ఞానం సంపాదించుకున్నారు. అవేమీ లేకుండా కేవలం తాను కూడా ఒకనాటి హీరోయిన్ గనుక.. ఆమెకు ఉజ్జీ కాగలనని వాణీ విశ్వనాధ్ అనుకుంటే భ్రమపడినట్టే. మహా అయితే.. ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఒకనాటి హీరోయిన్ కవిత లేని లోటును భర్తీ చేస్తుందేమో తప్ప.. రోజా ను ఎదుర్కొనలేదని అందరూ భావిస్తున్నారు.