ఇటు టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటు అటు టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా తమ తమ రాష్ట్రాల్లోని అసెంబ్లీ సంఖ్యను పెంచాల్సిందేనని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీవ్ర వత్తిడి తెస్తూనే ఉన్నారు. అయితే ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల సీట్లతో కాకుండానే తనకు తానుగా సంపూర్ణ మెజారిటీ సాధించిన ఆ కూటమి ప్రధాన పక్షం బీజేపీపై తాము అనుకున్నంత స్థాయిలో మాత్రం వారు వత్తిడి చేయలేకపోతున్నారు. ఎందుకంటే... కేంద్రానికి ఇప్పుడు ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వంతో అంతగా పనిలేదు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా కీలక భూమిక పోషిస్తున్న ప్రాంతీయ పార్టీలను ప్రధాని నరేంద్ర మోదీ అంత పెద్దగా లెక్క చేయడం లేదు. అంతేనా... ఆయా రాష్ట్రాల్లోని బలమైన ప్రాంతీయ పార్టీలను వీలయినంతమేరకు బలహీనపరచి, ఆ రాష్ట్రాల్లో పాగా వేయాలని మోదీ పక్కా ప్లాన్లు గీస్తున్నారు.
ఈ క్రమంలో ఇద్దరు చంద్రుల డిమాండ్ ను మోదీ అంతగా పట్టించుకున్న దాఖలా లేదు. ఎందుకంటే... రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుతో ఇటు టీడీపీతో పాటు టీఆర్ ఎస్ కు మంచి లాభం చేకూరుతుండగా, బీజేపీకి పెద్దగా లాభించదన్న వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మోదీ ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు - కేసీఆర్ లు ఒకేసారి కేంద్రంపై వత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు. లోపల ఏం జరిగిందో తెలియదు గానీ... ఈ అంశంపై ఇద్దరూ కేంద్రానికి ఒకే తరహా లేఖలు ఇచ్చారు. అది కూడా ఒకే సమయంలో ఈ లేఖలు కేంద్రానికి అందాయట. నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లోనే సీట్ల సంఖ్య పెంపునకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రం కూడా ఆ దిశగానే చర్యలు చేపట్టిందన్న వార్తలు కూడా వినిపించాయి.
ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వెళ్లిన సీట్ల సంఖ్య పెంపు ప్రతిపాదనకు కేంద్ర న్యాయ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తలు కూడా వినిపించాయి. కేంద్ర న్యాయ శాఖ అనుమతి మంజూరు చేసిందంటే దాదాపుగా పని అయిపోయినట్లేనన్న వాదన లేకపోలేదు. అయితే నిన్న పార్లమెంటు సమావేశాలకు ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీకి సీపీఎం తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి - రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరీ కూడా హాజరయ్యారు. భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ... ఈ దఫా కూడా చంద్రుల కల నెరవేరదని కుండబద్దలు కొట్టేశారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు మీద ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు లేదని తెలిపారు. ఇప్పటికే రాజ్యసభలో 10 - లోక్ సభలో 8 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. వెరసి ఈ సమావేశాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించిన బిల్లు పార్లమెంటు ముందుకు రాదని కూడా ఆయన తేల్చిపారేశారు.
ఇక సీతారం ఏచూరీ వాదన నిజమేనన్నట్లు... టీడీపీ సీనియర్ నేత - కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా కీలక ప్రకటన చేశారు. జీఎస్టీ అమలు - ఇబ్బందులపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించినట్టు చౌదరి తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనపై కొన్ని అంశాలు చర్చించాల్సి ఉందని, రాష్ట్రపతి ఎన్నికల తర్వాత దానిపై చర్చిస్తామని చెప్పారు. అంటే... ఈ దఫా పార్లమెంటు సమావేశాల్లో కూడా అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు లేవన్న మాట. మరి దీనిపై ఇద్దరు చంద్రుళ్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.