అవార్డులు ఇచ్చి పాక్ కు ర‌మ్మంటున్నారు

Update: 2015-11-04 16:17 GMT
దేశంలో మ‌త స‌హ‌నం మీద ర‌చ్చ ఓ రేంజ్‌ లో సాగ‌టం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై క‌వులు.. క‌ళాకారులు.. సెల‌బ్రిటీలు.. సినిమా వ‌ర్గానికి చెందిన వారు త‌మ పుర‌స్కారాల్ని వెన‌క్కి ఇచ్చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలోకి బాలీవుడ్ బాద్ షా షారూక్ ఎంట‌ర్ కావ‌టంతో విష‌యం మ‌రింత హాట్ హాట్ గా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఉగ్ర‌వాది.. ముంబ‌యి పేలుళ్ల సూత్ర‌ధారి హ‌ఫిజ్ స‌యిద్ తాజాగా చేసిన వ్యాఖ్య మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది. భార‌త్ లో అస‌హ‌నం పెరుగుతుందంటూ వ్యాఖ్యానించిన బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారూక్‌ ఖాన్ ను పాకిస్థాన్ వ‌చ్చేయ‌మ‌ని అత‌గాడు ఆహ్వానించ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. షారూక్ మీద బీజేపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో హ‌ఫీజ్ స్పందించాడు.

షారూక్ మ‌న‌సు పాక్ లో ఉందంటూ చేస్తున్న వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో.. భార‌త్ లో అవార్డులు తిరిగి ఇచ్చేసిన ముస్లింలంతా పాక్‌ కు వ‌చ్చేయొచ్చ‌న్నారు. పుర‌స్కారాలు తిరిగి ఇచ్చేసిన క‌ళాకారులు.. మేధావులు అంత‌ర్జాతీయ తీవ్ర‌వాది ఇచ్చిన ఇన్విటేష‌న్ పైన స్పందిస్తారా? లేదో?
Tags:    

Similar News