గన్నవరం, సత్తెనపల్లి... టీడీపీకి దిక్కే లేదబ్బా

Update: 2020-02-22 03:55 GMT
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బొక్క బోర్లా పడిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు. పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు అధినేత నారా చంద్రబాబునాయుడుకు అసలు ధైర్యం చాలడం లేదన్న మాట కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. అసలు పార్టీకి కొన్ని చోట్ల దిక్కంటూ లేదని, ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా మౌం దాల్చక తప్పడం లేదన్న మాటా వినిపిస్తోంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉన్నా... టీడీపీకి గట్టి పట్టున్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రెండు నియోజకవర్గాల మాట వింటేనే బాబు హడలిపోతున్నారట. కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంతో పాటు, గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం పేర్లు వింటేనే బాబు సైలెంట్ అయిపోతున్నారట.

గన్నవరం నియోజకవర్గం... మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి దక్కిన 23 నియోజకవర్గాల్లో ఒకటి. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది. జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలుంటే... 14 చోట్ల టీడీపీకి ఓటమి దక్కగా.. విజయవాడ తూర్పుతో పాటు గన్నవరం నియోజకవర్గాలు పార్టీ పరువును కాపాడాయి. అయితే గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన వల్లభనేని వంశీ మోహన్... ఇటీవలే వైసీపీకి దగ్గరగా జరగ్గా... ఆయనను చంద్రబాబే స్వయంగా సస్సెండ్ చేశారు. అప్పటినుంచి ఆ నియోజకవర్గానికి అసలు ఇంచార్జీనే లేకుండా పోయారు. ఎవరిని నియమిద్దామన్నా కూడా పార్టీలో అందరూ తమతో కాదంటే... తమతో కాదని చెప్పేస్తున్నారట. దీంతో ఇప్పటి దాకా గన్నవరానికి ఇంచార్జీని నియమించే విషయాన్ని చంద్రబాబు పక్కనపెట్టేశారట. ఈ నియోజకవర్గం మాటెత్తితేనే చంద్రబాబు సైలెంట్ అయిపోతున్నారట.

ఇక గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం కూడా టీడీపీకి దాదాపుగా కంచుకోట కిందే లెక్క. అయితే మాజీ స్పీకర్, దివంగత నే కోడెల శివప్రసాదరావు వ్యవహార సరళి కారణంగా మొన్నటి ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత కోడెల అవినీతిపై వరుస ఫిర్యాదులు రావడం, కోడెల కుమారుడు శివరాం, కూతురు విజయలక్ష్మిలపై వరుసగా కేసులు నమోదు కావడం, ఏకంగా కోడెలపైనే స్వయంగా అసెంబ్లీ ఫర్నీచర్ చోరీపై కేసు నమోదు కావడంతో కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పటి నుంచి సత్తెనలపల్లి నియోజకవర్గానికి ఇంచార్జీ లేకుండానే టీడీపీ కొనసాగుతోంది. ఈ పదవిని దక్కించుకునేందుకు కోడెల కుమారుడు శివరాంతో పాటు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు ఆసక్తిగా ఉన్నా... వారిద్దరిలో ఏ ఒక్కరిని అయినా ఇంచార్జీగా నియమించే అవకాశాలున్నా.. చంద్రబాబు ఆ దిశగా సాహసం చేయలేక పోతున్నారట. రాష్ట్రంలోని పలు నియోజక వర్గాలకు ఇంచార్జీలను నియమిస్తున్నా...గన్నవరం, సత్తెనపల్లిల విషయంలో మాత్రం చంద్రబాబు మైనంగానే ఉండిపోతున్నారట. మరి ఈ రెండింటికి ఇంచార్జీలు ఎప్పుడు వస్తారో? పార్టీ శ్రేణులకు ఎప్పుడు ధైర్యం నూరిపోస్తారోనన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Tags:    

Similar News