ఏపీలో రాజ్య‌స‌భ‌కు ఇంకా నో నామినేష‌న్స్!

Update: 2020-03-08 08:31 GMT
ఇప్ప‌టికే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఏపీ అసెంబ్లీ కోటాలో నలుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల ఎన్నిక‌కు సంబంధించి ప్ర‌క్రియ సాగుతూ ఉంది. ఇందుకు సంబంధించి నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ప్రారంభం అయ్యింది. ఆరో తేదీ నుంచినే ఇందుకు సంబంధించి నామినేష‌న్ల‌ను ఆహ్వానిస్తూ ఉంది ఎన్నిక‌ల సంఘం. శుక్ర‌వారం - శ‌నివారం.. నామినేష‌న్ల స‌మ‌యం పూర్తి అయ్యింది. అయితే ఇంత వ‌ర‌కూ ఏపీ అసెంబ్లీ కోటాలో రాజ్య‌స‌భ స‌భ్యుల ఎన్నిక‌కు సంబంధించి నామినేష‌న్లు ఏవీ దాఖ‌లు కాలేద‌ని ఈసీ ప్ర‌క‌టించింది.

తొలి రెండు రోజుల్లో నామినేష‌న్లు ఏవీ ప‌డ‌లేద‌ని ఇలా స్ప‌ష్ట‌త వ‌స్తోంది. ఇక ఆదివారం ఎలాగూ సెల‌వు ఉండ‌వ‌చ్చు. దీంతో తొలి మూడు రోజుల్లో ఎలాంటి నామినేష‌న్లు లేన‌ట్టే.

ఖాళీ అవుతున్న మొత్తం నాలుగు సీట్లూ ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకే ద‌క్కనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ త‌ర‌ఫునే నామినేష‌న్లు దాఖ‌ల‌య్యే అవ‌కాశం ఉంది. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల గురించి తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్న‌ట్టుగా కూడా లేదు. అయితే ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్య‌ర్థుల విష‌యంలో అధికారిక ప్ర‌క‌ట‌న‌లు ఏవీ రావ‌డం లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక నేత‌కు మాత్రం నామినేష‌న్ ప‌త్రాలు అందిన‌ట్టుగా టాక్. ఆయ‌నే ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి. ఆయ‌నకు రాజ్య‌స‌భ స‌భ్యత్వాన్ని ఖ‌రారు చేశార‌ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇక రెండో నామినేష‌న్ అంబానీ స‌న్నిహితుడు న‌త్వానీకి ద‌క్క‌బోతున్న‌ట్టుగా స‌మాచారం. మిగిలిన ఇద్ద‌రు ఎవ‌ర‌నేది మాత్రం ఇంకా స్పష్ట‌త‌లేని అంశ‌మే!
Tags:    

Similar News