ఉగాది వేళ జీతాల్లేవ్.. చేదుగా...బాధగా ...?

Update: 2022-04-02 11:30 GMT
ఉగాది పండుగ. తెలుగు వాకిట అతి పెద్ద వేడుక. ఉగాదిని ఆనందంగా జరుపుకోవాలని అంతా భావిస్తారు. పిండి వంటలతో ఇంటిల్లిపాదీ హాయిగా అస్వాదించాలని చూస్తారు. మరి దానికి ఇంధనంలా ధనం ఉండాలి కదా. వేతన జీవులకు జీతాలే ఆధారం. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే మామూలుగా చూస్తే  నెలాఖరుకు అంటే 31వ తేదీకే జీతాలు పడతాయి. కానీ ఏపీలో మాత్రం గత కొంతకాలంగా ఆ మాట మరచిపోవాల్సివస్తోంది.

ఫస్ట్ కి జీతాలు రావు అనుకోవడమూ ఒక సాధారణ  వ్యవహారం అయిపోయింది. దాంతో ఉగాది రెండునే ఎందుకు వచ్చింది అని చింతించాల్సిన పరిస్థితి. ఏ పదవ తారీఖుకో ఉగాది వస్తే ఆ పాటికి జీతాలు పడేవి అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు జోక్స్ కట్ చేస్తున్నారు.

నిజానికి ఇప్పటిదాకా జీతాలకు కొరత ఆర్ధిక ఇబ్బందుల వల్ల వచ్చేది. గత రెండు మూడు నెలలుగా ఆర్ధిక ఇబ్బందులు కొంత తగ్గాయి. అదే టైం లో ఇంకో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టెక్నికల్ రీజన్స్ పేరిట జీతాలు ఆలస్యం అవడమూ జరుగుతోంది. ఇపుడు ఉగాది వేళ అదే జరిగింది.

ఇప్పటిదాకా గత  ప్రభుత్వం తీసుకువచ్చిన సాఫ్ట్ వేర్ విధానం  సీఎఫ్ఎంఎస్‌ పేరిట జీతాలు చెల్లించేవారు. దాన్నే వైసీపీ కూడా మూడేళ్ళుగా అనుసరిస్తూ పోయింది. కానీ ఎందుకో ఈ విధానాన్ని మార్చాలని చూస్తోంది. దానికి బదులుగా హెచ్ఆర్ఎంఎస్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఈ సాఫ్ట్ వేర్ తోనే ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడతాయి.

మరి ఈ కొత్త విధానం అయితే ఇప్పటిదాకా ఆర్బీఐతో అనుసంధానం కాలేదని చెబుతున్నారు. అలాగే హెచ్ఆర్ఎంఎస్ విధానంలో బిల్లుల అప్‌లోడ్ ఇంకా కొన‌సాగుతోంద‌ని, అది పూర్త‌య్యే స‌రికి కచ్చితంగా నాలుగైదు రోజుల సమయం పడుతుందని అంటున్నారు.

అంటే ఈ నెల   జీతాలు  ఆరేడు తేదీలకు కానీ రావు అన్న మాట. అంటే ఈ నెల 10వ తేదీ శ్రీరామ నవమి. అప్పటికి జీతాలు నిండుగా ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో పడడం ఖాయమని అంటున్నారు. సో ఉద్యోగులూ ఈసారి ఉగాదికి చేదు కాస్తాఎక్కువ అయిందని, అది ముందే తెలిసిందని అనుకొని హ్యాపీగా గడిపేయడమే అంటున్నారు.
Tags:    

Similar News