బాబుకు మైండ్ బ్లాంక్‌..నోటా కంటే ఏపీ మంత్రికి త‌క్కువ ఓట్లు

Update: 2019-05-23 11:02 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఓట‌మిలో త‌గిలిన షాకుల ప‌రంప‌ర‌లో మ‌రో ఎపిసోడ్ ఇది. చంద్ర‌బాబు కేబినెట్ స‌హ‌చ‌రుడికి నోటా కంటే ఓట్లు త‌క్కువ రావ‌డం గ‌మానార్హం. విశాఖపట్టణం జిల్లాలోని అరకు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ప‌రిణామం చోటుచేసుకుంది. అక్క‌డి నుంచి బ‌రిలో దిగిన ఏపీ మంత్రి, అరకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిడారి శ్రవణ్ కుమార్ కంటే నోటాకే అత్యధిక ఓట్లు లభించాయి. సెంటిమెంట్‌ పై భారీ ఆశ‌లు పెట్టుకున్న టీడీపీకి షాక్ త‌గిలింది.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అరకు ఎమ్మెల్యే - శ్రవణ్ తండ్రి కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు ఇటీవల హతమార్చిన విషయం తెలిసిందే. కిడారి కుటుంబం బాధ్యతను తీసుకున్న చంద్రబాబు, అందులో భాగంగా శ్రవణ్ కు మంత్రి పదవి ఇచ్చారు. ఇదే నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో శ్రవణ్ ను బరిలోకి దింపారు. అయితే, శ్ర‌వ‌ణ్ ఘోర ప‌రాజ‌యం చెందారు. నోటా కంటే కూడా త‌క్కువ ఓట్లు ద‌క్కాయి.  అరకు నుంచి వైసీపీ తరఫున చెట్టి ఫల్గుణ పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో శ్ర‌వ‌ణ్‌కు సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం ఓ మైన‌స్ అయితే... నోటా కంటే త‌క్కువ ఓట్లు రావ‌డం మ‌రీ ఘోరం.


Tags:    

Similar News