రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్... ప్రపంచ టెన్నిస్ చరిత్రలో చెరపలేని పేర్లు. ఒకే తరంలో బరిలో ఉన్న హేమాహేమీలు. మరెప్పుడూ బహుశా చూడలేని అరుదైన త్రయంఇది. ఒకటీ రెండు కాదు గత 22 ఏళ్లలో 85 గ్రాండ్ స్లామ్ టోర్నీలు జరగ్గా.. 60 వీళ్లే గెలిచారంటే అర్థం చేసుకోవచ్చు ఈ త్రయం ఘనత ఏపాటిదో. ఓ ఏడెనిమిదేళ్లు ఫెడరర్.. మరో ఏడెనిమిదేళ్లు నాదల్, ఐదారేళ్లుగా జకో. వీరిదే ఏ టోర్నీ అయినా హవా. ముగ్గురూ 20 టైటిళ్ల మీద ఉన్నారు ప్రస్తుతం. అయితే ఫెడరర్ మరో టైటిల్ సాధించే స్థితిలో లేడు. నాదల్ కొట్టగలిగే స్థితిలో ఉన్నా గాయాలు వెనక్కులాగుతున్నాయి. మిగిలింది జకో ఒక్కడే. అతడు ఈ నెలలో జరుగనున్న ఆస్టేలియన్ ఓపెన్ తో 21వ గ్రాండ్ స్లామ్ సాధించే అవకాశం ఉంది. వాస్తవానికి ఇది నిరుటి వింబుల్డన్ తోనే పూర్తి కావాల్సింది. ఫైనల్లో జకో ఓటమితో తాత్కాలికంగా ఆగింది. అయితే, చరిత్రకెక్కే క్రమంలో ఆసీసీ గడ్డపై అడుగుపెట్టిన జకోకు అనుకోని అవాంతరంఎదురైంది. అదీ కొవిడ్ టీకా రూపంలో.. అయితే, ఇప్పుడా కారుమబ్బులు తొలగినట్లే కనిపిస్తోంది.
కేసు గెలిచిన టెన్నిస్ దిగ్గజం టెన్నిస్ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్‌కు ఊరట కలిగింది. ఆస్ట్రేలియా కోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. విచారణ అనంతరం అతడిని వెంటనే క్వారంటైన్ డిటెన్షన్ సెంటర్ నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే అతడి వీసాను కూడా పునరుద్ధరించాలని తెలిపింది. ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు ఈ సెర్బియన్ ఆటగాడు గత బుధవారం మెల్‌బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, అతడి వద్ద వాక్సినేషన్‌కు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా బోర్డర్ ఫోర్స్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే జకోవిచ్‌ను ఆస్ట్రేలియాలోకి అనుమతించకుండా వీసాను రద్దు చేయడంతో పాటు డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు.
ఈ విషయంపై న్యాయ పోరాటం చేసిన జకోవిచ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు తనకు ప్రత్యేకమైన వైద్యపర మినహాయింపులు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే గతనెల 16న కరోనా బారిన పడ్డానని, తర్వాత కోలుకొని వైద్య మినహాయింపు పొందానని తన లాయర్ల ద్వారా కోర్టుకు విన్నవించాడు. సోమవారం విచారణ జరిపిన జడ్జి ఆంటోనీ కెల్లీ చివరికి అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ విమానాశ్రయంలో జకోవిచ్‌తో అధికారులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. అతడి వస్తువులు తిరిగివ్వాలని, వెంటనే డిటెన్షన్ సెంటర్ నుంచి తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్‌లతో కొనసాగుతోన్న ఈ దిగ్గజ ఆటగాడు ఈ ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజయం సాధించి కొత్త రికార్డు నెలకొల్పాలని చూస్తున్నాడు. అయితే, జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడతాడో.. లేదా? తెలియాల్సి ఉంది.