సుహాసినికి ఎన్టీఆర్ షాక్‌...ప్ర‌చారానికి నో

Update: 2018-12-01 16:50 GMT
కూక‌ట్‌ ప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం... తెలంగాణ రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో అంద‌రి చూపు ప‌డిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి. దివంగ‌త నంద‌మూరి హ‌రికృష్ణ త‌న‌య సుహాసిని బ‌రిలో దిగిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్నుంచి ఎన్టీఆర్ ప్ర‌చారానికి వ‌స్తారా? రారా? అన్న చ‌ర్చ పెద్ద ఎత్తున సాగిన విషయం తెలిసిందే. 

నంద‌మూరి సుహాసిని నామినేష‌న్ స‌మ‌యంలోనే విభిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఆమె బ‌రిలోకి దిగ‌డం ఎన్టీఆర్‌ కు స‌హా ఆయ‌న సోద‌రుడైన క‌ళ్యాణ్ రామ్‌ కు న‌చ్చ‌లేద‌నే టాక్ వ‌చ్చింది. అయితే, ఈ విశ్లేష‌ణ‌లు ముద‌ర‌డంతో..ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపి క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నాన్ని ఈ సోద‌రులిద్ద‌రూ చేసుకున్నారు. అయితే అందులో ఎక్క‌డా టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు పేరు లేదు. దీంతో టీడీపీకి - హ‌రికృష్ణ కుటుంబ స‌భ్యులైన‌ ఎన్టీఆర్‌ - క‌ళ్యాణ్ రామ్‌ కు ఉన్న గ్యాప్ సుస్ప‌ష్టం అయింది.

అయితే, త‌మ సోద‌రి సుహాసినికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసే విష‌యంలో తార‌క్ ఏం తేల్చుకోలేక‌పోతున్నార‌ని టాక్ సాగుతుండ‌గానే, తాజాగా ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. తన సోదరి సుహాసినికి మ‌ద్ద‌తుగా ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉండ‌నున్నట్లు సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది.

కాగా, సుహాసిని గెలుపుకోసం శ‌నివారం టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ప్ర‌చారం నిర్వ‌హించారు. అమరావతిలో నాలుగు ఇటుకలు కూడా వేయలేదంటున్నారని.. అమరావతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడే పరిస్థితి వస్తుందన్నారు. ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు సైబరాబాద్‌ సృష్టికర్తను... ఇప్పుడు అమరావతి సృష్టికర్తనన్నారు. దేశంలోనే ఎక్కడాలేని ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ హైదరాబాద్‌ లోనే ఉందని చెప్పారు.


Tags:    

Similar News